Ticket Rates : సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే..!
ప్రధానాంశాలు:
Ticket Rates : సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే..!
Ticket Rates : ఈ మధ్య సినిమా టిక్కెట్ ధరలు అనూహ్యంగా పెరగడం మనం చూశాం. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంపై రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. రేవతి కుమారుడు శ్రీతేజ ఆపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని అన్నారు. ఈ దుర్ఘటన తర్వాత ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ తరహాలో ఏపీలో కూడా సినిమా టికెట్ల ధరలు పెంచబోమని, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమనే ప్రకటన చేయాలని కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.
Ticket Rates కొత్త ప్రతిపాదన..
ఇక టికెట్ రేట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలు పెంచమని అంటుంది. మరి ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటని చర్చ నడుస్తుంది. అయితే టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా సినీ ఇండస్ట్రీలో డైనమిక్ టిక్కెట్ ప్రైసింగ్ సిస్టమ్ ను అమలు చేయాలని సూచించారు. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని కోరారు. ఈ మేరకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో జరిగిన సమావేశంలో పవన్ కీలక సూచనలు చేశారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు.
డైనమిక్ టిక్కెట్ ధరలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికతో ప్రతిపాదనను రూపొందించాలని కోరినట్లు చెప్పారు. టికెట్ ధరలను నిర్ణయించే వెసులుబాటు నిర్మాతలకు ఉండాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు బన్నీ వాసు తెలిపారు. టిక్కెట్ ధరలపై ప్రైస్ కాప్ ఉండాలని తాము చెప్పినట్లు అన్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. వీక్ డేస్ లో టికెట్స్ ధరలు తగ్గించి.. వీకెండ్ లో ప్రీమియం ధరలు ఉండాలని అన్నట్లు చెప్పామని బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ముంబై, బెంగళూరులో ఆ విధానం అమలులో ఉందని తెలిపారు. ఇప్పుడు ఆ ధరల విధానాన్ని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపాదన సిద్ధమైన తర్వాత పవన్ కళ్యాణ్ ను కలుస్తామని బన్నీ వాసు తెలిపారు. మొత్తానికి ఏపీలో కొత్త టికెట్ ధరల విధానం అమలులోకి రావడం దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తుంది.