Nani Dasara Movie Public Talk : నాని దసరా మూవీ పబ్లిక్ టాక్.. పుష్పను మించిపోయే హిట్ అంటున్నారు భయ్యా.. వీడియో

Advertisement

Nani Dasara Movie Public Talk : ఈ మధ్య టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. చాలా రోజుల తర్వాత శ్రీరామనవమి సందర్భంగా నాచురల్ స్టార్ నాని దసరా మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం నాని చాలా కష్టపడ్డారు. ఇప్పటి వరకు నాని నటించిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఈ సినిమాను నాని మాత్రమే కాదు.. మూవీ యూనిట్ మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

tollywood hero nani Dasara Movie Genuine Public Talk
tollywood hero nani Dasara Movie Genuine Public Talk

ఈ సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ సినిమా తాజాగా శ్రీరామనవమి సందర్భంగా విడుదలైంది.ఈ సినిమాలో చాలామంది నటులే ఉన్నా ఈ సినిమాకు ప్రాణం మాత్రం నానినే అంటున్నారు పబ్లిక్. ఇప్పటికే సినిమా విడుదలై బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో పబ్లిక్ ఈ సినిమా గురించి, సినిమా నటుల పర్ ఫార్మెన్స్ గురించి చెప్పుకొచ్చారు. సినిమాకు కర్త, కర్మ, క్రియ మొత్తం నాని అంటున్నారు. నాని తన భుజాల మీద ఈ సినిమాను మోశారు అంటున్నారు.

Advertisement

Nani Dasara Movie Public Talk : వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ పాత్ర అదుర్స్

ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేశ్ కూడా అదరగొట్టేసింది. తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది అంటున్నారు. ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే.. పుష్ప సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాను మించిపోయేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్పలాంటి వంద సినిమాలతో ఈ సినిమా సమానం అంటున్నారు. ఇప్పటి వరకు నాని ఖాతాలో పడని హిట్ అంటున్నారు.

పుష్ప ఈ సినిమా ముందు పనికిరాదని నాని ఫ్యాన్స్ అంటుంటే.. పుష్ప సినిమాతో కంపేర్ ఎందుకు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా విడుదలైందో లేదో.. సినిమాను, పుష్పతో కంపేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు జనాలు. నాని దసరా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందా అనేది పక్కన పెడితే.. థియేటర్ల వద్ద మాత్రం బెనిఫిట్ షో చూసిన వాళ్లు పుష్ప సినిమా దీనికింద పనికిరాదంటున్నారు. అసలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement