Trisha : బాబోయ్ త్రిష ల‌వ్ ఎఫైర్ అంత‌మందితో న‌డిపిందా.. లిస్ట్ చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha : బాబోయ్ త్రిష ల‌వ్ ఎఫైర్ అంత‌మందితో న‌డిపిందా.. లిస్ట్ చూస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :2 September 2022,6:00 pm

Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు చేయ‌న‌క్క‌ర్లేదు. తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన త్రిష కృష్ణన్ తమిళ సినీ పరిశ్రమ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత తమిళ, తెలుగు, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో జోడి అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. అనేక మంది స్టార్ హీరోలతో కూడా క‌లిసి ప‌ని చేసింది. ఆమె సినిమాలు అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం మణి రత్నం దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Trisha : ప్రేమాయ‌ణం..

ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో పాటు గ‌ర్జ‌న‌, రోడ్‌, రంగి, చ‌దురంగ వేట్టై 2 చిత్రాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో తమ పార్టీని బలపరుచుకునే ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తమిళ సినీ పరిశ్రమకు రాజకీయ రంగానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న నేపథ్యంలో తమ అభిమాన హీరోయిన్ కూడా అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని అందరూ భావించారు. కాని త్రిష ఆ వార్త‌ల‌ని కొట్టి పారేసింది. అవ‌న్నీ పుకార్ల‌ని తేల్చి పారేసింది.

Trisha Has More Than 2 Love Affairs In Her List

Trisha Has More Than 2 Love Affairs In Her List

ఇక ఈ అమ్మడు తాజాగా ప్రేమాయ‌ణంతో వార్త‌లలోకి ఎక్కింది. ఈ అమ్మ‌డు పలువురి తోలవ్ ఎఫైర్ లు నడిపించింది అని కూడా ఇండస్ట్రీ లో టాక్ ఉంది. ప్రముఖ వ్యాపార వేత్త వరుణ్ మనియన్‌తో త్రిష లవ్ ట్రాక్ నడిపించింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఆ తరవాత ఏం జరిగిందో ఏమో గానీ వీరిద్దరూ విడిపోయారు. వరుణ్ తో విడిపోయిన రెండు నెలలకే త్రిష హీరో రానాతో ప్రేమాయణం నడిపింది అంటూ టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొంతకాలానికి ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వాళ్ళు చుస్కున్నారు. అంతే కాకుండా త్రిష మొదటి సారిగా తమిళ స్టార్ హీరో విజయ్ తో లవ్ ట్రాక్ నడిపింది అంటూ కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ధనుష్ కూడా త్రిష తో లవ్ ఎఫైర్ నడిపించాడు అనే టాక్ ఉంది. శింబుతోను కూడా ఈ అమ్మ‌డికి ఎఫైర్ ఉంద‌నే టాక్ ఉంది.ఇలా చాలా మందితో ప్రేమాయణాలు నడిపించిన త్రిష ప్రస్తుతం సింగిల్ గానే ఉంటోంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది