Trisha : త్రిష కనపడితే పిచ్చెక్కిపోతోన్న కుర్రాళ్ళు .. ఎవడు చేసుకుంటాడో కానీ !
Trisha : హీరోయిన్ త్రిష ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సౌత్ లో భారీ అభిమానులను సొంతం చేసుకుంటూనే ఉంది. ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ ఇప్పటికి చెరగని అందంతో అభిమానులను ఫిదా చేస్తుంది […]
Trisha : హీరోయిన్ త్రిష ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సౌత్ లో భారీ అభిమానులను సొంతం చేసుకుంటూనే ఉంది. ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ ఇప్పటికి చెరగని అందంతో అభిమానులను ఫిదా చేస్తుంది త్రిష. ఇక త్రిష ఇటీవల ‘ రంగీ ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఇక ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 విడుదల కోసం ఎదురుచూస్తుంది. ఈ సినిమా మొదటి భాగం విడుదలై కోలీవుడ్లో భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే పార్ట్ 2 కూడా తెరకెక్కింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇక ఆ సమయంలో త్రిష సెంటర్ ఆఫ్ పెట్రాక్షన్ గా నిలిచింది. నిజంగా ఆమె ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిందా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆమె వయసు 30 దాటింది అంటే ఎవరు నమ్మరు అంతా అందంగా, క్యూట్ గా కనిపించింది.
ఈ ప్రమోషన్స్ లో పోనియన్ సెల్వన్ నటులు విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య, లక్ష్మి, శోభిత దూళిపాల కూడా పాల్గొన్నారు. అయితే వీళ్ళ అందరిలో త్రిష మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరికంటే ఎక్కువగా ఆమె అభిమానులే ఈ సినిమాను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరోవైపు పోనియన్ సెల్వన్ లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఐశ్వర్యరాయ్ మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. ఇక త్రిష ఈ సినిమాతో హిట్టు కొడుతుందో లేదో చూడాలి. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సినిమా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తుంది.