Trisha : పెళ్లి విషయం లో హీరోయిన్ త్రిష దారుణ నిర్ణయం ?
Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సౌత్ టాప్ హీరోయిన్‌గా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఏలిన త్రిష ఇప్పుడు కేవలం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. త్రిష తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో నటించి అభిమానులను మెప్పించింది. మరోవైపు త్రిష పెళ్లిపై చాలా కాలంగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తాను ఇంత వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదనే ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తనకు తెలియదని… మనసుకు నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా చేసుకుంటానని తెలిపింది. త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అడిగితేనే సమాధానం ఇస్తాను. అది కూడా నా వ్యక్తిగతమే. నావివాహం ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నాతో జీవితాంతం ఉండగలిగే వ్యక్తి దొరకాలి. నాచుట్టూ ఉన్న చాలా మంది వివాహం చేసుకుని సంతృప్తిగా లేరు. వివాహం చేసుకుని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు.

Trisha stunning decision about marriage
Trisha : ఇలాంటి నిర్ణయం ఎందుకు…
మధ్యలో ముగిసిపోయే బంధాలు నాకు వద్దు. అందుకే నా వివాహం ఆలస్యం అవుతోంది అని త్రిష పేర్కొంది. 40 ఏళ్ళు వస్తున్నా నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. అలాగే వివాహం ఎప్పుడు చేసుకుంటానో కూడా తెలియదు అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం త్రిష.. ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరుపుకుంది. కానీ వారిద్దరూ పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు. ఆ సంఘటనతో త్రిష పెళ్లి విషయంలో చాలా ఆలోచిస్తుంది. మరో వైపు త్రిష ఫ్రెండ్ సమంత పెళ్లి కూడా పెటాకులు కావడంతో త్రిష నెక్ట్స్ స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలని అనుకుంటుంది.