Bheemla Nayak : భీమ్లా నాయక్ ఈ విషయానికి కూడా త్రివిక్రమ్ హెల్ప్ తీసుకున్నారట
Bheemla Nayak : పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటించిన భీమ్లా నాయక్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే మలయాళం ఒరిజినల్ సినిమాకు చాలా మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్ ను తెరకెక్కించారు. త్రివిక్రమ్ చేతుల మీదుగా చాలా మార్పులు చేర్పులు జరిగాయి .దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమా కథను మార్చినట్లు గా త్రివిక్రమ్ చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది.
నిర్మాణ విషయాలు మొదలుకొని సినిమాలోని ప్రతి విషయం కూడా ఆయన నిర్ణయాధికారం తోనే సాగినట్లు సమాచారం అందుతోంది. తాజాగా జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విషయంలో కూడా ఆయన నిర్ణయమే ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్క్రిప్టును రెడీ చేశాడు. అదే విధంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా స్వయంగా వెళ్లి మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించడం జరిగింది. మంత్రి త్రివిక్రమ్ ఆహ్వానాన్ని మన్నించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు. కేటీఆర్ హాజరయితే కచ్చితంగా భీమ్లా నాయక్ పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అనే అభిప్రాయంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజల్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పవన్ కు సన్నిహితంగా ఉంటున్నామని చెప్పుకునేందుకు కేటీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు ఓకే అని ఉంటాడని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి త్రివిక్రమ్ పక్కా వ్యూహం తో భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మేకింగ్ విషయంలోనే కాకుండా ఇలా ప్రమోషన్ విషయంలో కూడా త్రివిక్రమ్ హెల్ప్ భీమ్లా నాయక్ కి చాలా ఉపయోగపడుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.