Intinti Gruhalakshmi : హనీ మెడలోని చైన్ ను తులసి కొట్టేస్తుందా? తులసి ఇంటికి వెళ్లి సామ్రాట్ రచ్చ.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?
Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 18 జులై 2022 ఎపిసోడ్ 687 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ హనీకి కిడ్నాప్ చేసిన తులసిని వదలను అని అనుకుంటాడు సామ్రాట్. హనీ నిద్రపోతుండగా వెళ్లి తనకు చెబుతాడు. కానీ.. తను నిద్రపోదు. సామ్రాట్ మాటలను విని.. వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతుంది. దీంతో అతడు షాక్ అవుతాడు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు అంటాడు. సరే.. నువ్వు వెళ్లి పడుకో. నేను తులసి విషయం చూసుకుంటా అని అంటాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తులసిని వదిలేయమని చెబుతాడు. దీంతో తులసి, పరందామయ్య, అనసూయను విడుదల చేస్తారు.
మిమ్మల్ని జైలులో పెట్టించినందుకు క్షమించండి అని తులసితో ఫోన్ లో మాట్లాడుతాడు. ఆ తర్వాత తులసి నేరుగా నందు, లాస్య ఇంటికి వెళ్లి వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. మీరు యాక్సిడెంట్ చేసిన విషయం నాకు తెలుసు.. అంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వస్తుంది. తను ఇంటికి వచ్చాక ప్రేమ్ తనతో మాట్లాడుతాడు. తన చేతిలో రూ.5 లక్షల చెక్ ను పెడతాడు. ఆ చెక్ ను చూసి తులసి షాక్ అవుతుంది. నాకు డబ్బులేవీ వద్దు. నువ్వే ఉంచుకో అంటుంది. నువ్వే మంచి ఆల్బమ్ చేసి అంటుంది. కానీ.. నువ్వు మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తే బెటర్ అంటాడు ప్రేమ్. నా మ్యూజిక్ స్కూల్ సంగతి నేను చూసుకుంటా. నువ్వు మాత్రం ఆల్బమ్ మీద ఫోకస్ పెట్టు అంటుంది.
Intinti Gruhalakshmi : బిజినెస్ డీల్ కోసం సామ్రాట్ ను కలిసిన నందు, లాస్య
కట్ చేస్తే.. బిజినెస్ డీల్ కోసం నందు, లాస్య.. సామ్రాట్ ను కలుస్తారు. ఆయన ఆఫీసుకు వెళ్తారు. వాళ్ల ప్రపోజల్ ను చెబుతారు. దీంతో అన్నింటికీ సామ్రాట్ ఒప్పుకుంటాడు కానీ.. నందు మీద నమ్మకం లేదంటాడు. దీంతో నందుకు కొన్ని రోజులు తన దగ్గర ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేయమంటాడు.
ఇంతలో సామ్రాట్ కు ఎస్ఐ నుంచి ఫోన్ వస్తుంది. ఏమైంది.. నా కూతురు యాక్సిడెంట్ గురించి ఏవైనా విషయాలు తెలిశాయా అని అడుగుతాడు. ఆ తులసిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు అంటాడు. తులసి పేరు విని నందు, లాస్య షాక్ అవుతారు.
అంటే.. నేను యాక్సిడెంట్ చేసింది సామ్రాట్ కూతురుకా అని భయపడతాడు. కానీ.. ఆ తులసిని వదిలిపెట్టాం కదా అని ఎస్ఐ సామ్రాట్ తో చెబుతాడు. దీంతో అలా ఎలా వదిలేశారు అని అడుగుతాడు. దీంతో మీరే వదిలేయమన్నారని.. మీ బాబాయి చెప్పాడు అంటాడు పోలీస్.
దీంతో సరే.. నేను చూసుకుంటా. ముందు యాక్సిడెంట్ చేసిన వాళ్ల గురించి తెలుసుకోండి అని ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత తులసి ఇంట్లో ఉండగా.. తన పనివాళ్లను, హనీని తీసుకొని తులసి ఇంటికి వస్తాడు సామ్రాట్. ఏకంగా పాపను కిడ్నాప్ చేసిన మనిషికి చైన్ దొంగతనం చేయడం ఒక లెక్కా. చిన్నమ్మాయి గారి గోల్డ్ చెయిన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అది ఈ ఇంట్లోనే ఉంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా ప్రతి అంగుళం వెతకండి అని తన పనివాళ్లకు చెబుతాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.