Uppena : ఉప్పెన కాంబో మళ్ళీ రిపీట్ ఆ ఒక్కరు తప్ప..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uppena : ఉప్పెన కాంబో మళ్ళీ రిపీట్ ఆ ఒక్కరు తప్ప..!

 Authored By govind | The Telugu News | Updated on :8 April 2021,11:00 am

Uppena : ఉప్పెన సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. డెబ్యూ హీరోగా మెగా మేనల్లుడు టాలీవుడ్ కి పరిచయమైన ఈ సినిమాతో పాతికేళ్ళ నుంచి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేశాడు టాలీవుడ్ లో డెబ్యూ హీరోగా చిరుతతో రాం చరణ్ క్రియేట్ చ్జేసిన రికార్డ్ ని అలాగే బాలీవుడ్ లో డెబ్యూ హీరోగా కహోనా ప్యార్ హై సినిమాతో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని వైష్ణవ్ తేజ్ బద్దలు కొట్టి ఇప్పట్లో మరే డెబ్యూ హీరో సాధించని రికార్డ్ సెట్ చేశాడు. ఒకరకంగా కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే ఏ స్టార్ కిడ్ కి అయినా ఇది పెద్ద సవాల్ అని చెప్పాలి.

uppena combo repeats except the director

uppena-combo repeats except the director

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉప్పెన సినిమాని నిర్మించారు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి యంగ్ బ్యూటీ కృతిశెట్టి పరిచయం అయింది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా 100 కోట్లు వసూళ్ళు చేసి ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యపరచింది. ఇంత పెద్ద సక్సస్ ఇచ్చిన దర్శకుడు బుచ్చి బాబుకి నిర్మాతలు ఇటీవల ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. ఇక హీరో, హీరోయిన్, మ్యూజి డైరెక్టర్ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ లకి ప్రశంసలతో పాటు బహుమతులు దక్కాయి.

Uppena : ఈ దర్శకుడు కూడా సుకుమార్ శిష్యుడు కావడం విశేషం.

కాగా మరోసారి ఇదే కాంబినేషన్ రిపీటవబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వైష్ణవ్ తేజ్ – కృతిశెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఉప్పెన టీమ్ మొత్తం పని చేస్తోంది. కానీ దర్శకుడు మాత్రం బుచ్చిబాబు కాకుండా మరో డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఈ దర్శకుడు కూడా సుకుమార్ శిష్యుడు కావడం విశేషం. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందట.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది