Varalaxmi Sharath Kumar : చెంప పగులుద్ది జాగ్రత్త.. సురేశ్ కొండేటికి వరలక్ష్మీ శరత్ కుమార్ మాస్ లేవల్ వార్నింగ్ అదుర్స్
Varalaxmi Sharath Kumar : సురేశ్ కొండేటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ గురించి ఆయన అడిగిన ప్రశ్నలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. హీరోయిన్ శరీరం మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టారా అంటూ సిద్ధూను సురేశ్ కొండేటి అడుగుతాడు. అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సిద్దూ దాటవేస్తాడు కానీ.. అసలు ఒక సినిమా జర్నలిస్టు ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏంటి అంటూ జనాలు […]

Varalaxmi Sharath Kumar : సురేశ్ కొండేటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ గురించి ఆయన అడిగిన ప్రశ్నలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. హీరోయిన్ శరీరం మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో లెక్కపెట్టారా అంటూ సిద్ధూను సురేశ్ కొండేటి అడుగుతాడు. అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సిద్దూ దాటవేస్తాడు కానీ.. అసలు ఒక సినిమా జర్నలిస్టు ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏంటి అంటూ జనాలు కూడా సీరియస్ అయ్యారు. సురేశ్ కొండేటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా కూడా సురేశ్ కొండేటి మాత్రం అస్సలు మారలేదు. తన బుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ ప్రతి సినిమా ప్రమోషన్స్ సమయంలో, మీడియా మీట్ సమయంలో అలాంటి ప్రశ్నలే. ఎంత మంది సినీ ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు తిట్టినా, ఆయనపై ఆగ్రహం చూపించినా అస్సలు మారడం లేదు.
తాజాగా ఓంకార్ దర్శకత్వంలో మాన్షన్ 24 అనే మూవీ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ ను తాజాగా మూవీ యూనిట్ నిర్వహించింది. ఈ సినిమా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో సురేశ్ కొండేటి.. వరలక్ష్మిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగాడు. అంతకుముందు మీరు దెయ్యలు, ఆత్మలు ఉంటాయని నిజంగా నమ్ముతున్నారా అని మరో రిపోర్టర్ ప్రశ్నించగా అవును నమ్ముతాను అని అంటుంది వరలక్ష్మీ. ఇంతలో సురేశ్ మైక్ తీసుకొని అంటే దెయ్యాలు ఉన్నాయనే ఈ సినిమా చేశారా అని అడుగుతాడు. దీంతో దెయ్యాలు ఉన్నాయని సినిమా చేయడం అంటే.. అలా అంటే ఎవ్వరూ ఏ సినిమా చేయరు అంటూ స్ట్రాంగ్ రిప్లయి ఇస్తుంది. ఆ తర్వాత దెయ్యాలను ఇష్టపడతారా? లేక దేవుడిని ఇష్టపడతారా? అని మరో పనికిమాలిన ప్రశ్న అడుగుతాడు సురేశ్. దీంతో ఇదొక ప్రశ్ననా.. జనరల్ గా ఎవరిని ఇష్టపడుతారు అంటూ మరోసారి కౌంటర్ ఇచ్చింది వరలక్ష్మీ.

#image_title
Varalaxmi Sharath Kumar : మీ డైరెక్టర్ దెయ్యాలను ఇష్టపడతాడు కదా?
ఓంకార్ మామూలుగా దెయ్యాలను ఇష్టపడతాడని అంటాడు సురేశ్. ఆ తర్వాత బిగ్ స్క్రీన్ లో మీరు బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కదా. అలాంటి మీరు ఓటీటీ సినిమా కోసం ఇన్ని డేట్స్ ఎందుకు కేటాయించారు అని అడిగితే అలా ఏం ఉండదండి.. నేను ఆర్టిస్ట్ ని అంతే.. ఓటీటీనా.. సినిమానా అనేది చూడం అంటుంది వరలక్ష్మీ.