Varun Tej : హీరో కాక‌పోతే పోరంబోకు అయ్యేవాడిని అన్న వ‌రుణ్ తేజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun Tej : హీరో కాక‌పోతే పోరంబోకు అయ్యేవాడిని అన్న వ‌రుణ్ తేజ్

 Authored By sandeep | The Telugu News | Updated on :17 March 2022,7:00 pm

Varun Tej: మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన హీరోలు అద్భుత‌మైన అభిన‌యం క‌న‌బ‌రుస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిన విష‌యం తెలిసిందే. వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ మంచి సినిమ‌లు చేస్తున్న   తాజాగా గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను షెడ్యూల్ ప్రకారం గతేడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని ప్రకటించింది చిత్రబృందం. ఆ తర్వాత ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆ తర్వాత ‘అన్నాత్తే’ (పెద్దన్న) పోటీలో ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ 3కు రీ షెడ్యూల్ చేసారు.

కానీ డిసెంబర్ 2న బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.అనేక వాయిదాల త‌ర్వాత ఈ సినిమా విడుద‌ల కానుంది.ఇప్పటికే విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితమే గని ట్రైలర్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ పంచ్ లాగే ట్రైలర్ సాలిడ్ గా, ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యాయి.బాక్సింగ్ చాంపియన్ కావాలనుకునే ’గని’ నుంచి నువ్వు జీవితంలో బాక్సింగ్ ఆడనని అమ్మకు మాటిస్తాడు. మరి అమ్మ మాటను జవదాటి ఎలా బాక్సింగ్‌లో గని నేషనల్ ఛాంపియర్ అయ్యాడనేదే ‘గని’ మూవీ స్టోరీలా కనిపిస్తోంది.

varun tej stunning comments in ghani trentailer release ev

varun tej stunning comments in ghani trentailer release ev

Varun Tej : వ‌రుణ్ తేజ్ ఎమోష‌న‌ల్..

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా స్టోరీనే కాస్తా అటు ఇటు మార్చి తెరకెక్కించారు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్‌లో చాలానే తెరకెక్కాయి. ట్రైలర్ ఈవెంట్ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘మూడేండ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. ప్రేక్షకులకు మంచి సినిమాను ఇచ్చేందుకు గనిని రూపొందించాం. నిజనానికి నేను సినిమాల్లోకి రాకపోతే ఎక్కడో పోరంబోకులా తిరిగే వాడిని, నాకు సినిమా డిసిప్లయిన్ నేర్పించింది. బతకడం నేర్పించిందంటూ కొంత ఎమోషనల్ అయ్యాడు.’ వాస్తవానికి గని మూవీ కోసం వరుణ్ తేజ్ స్పెషల్ కోచ్ ను పెట్టుకొని ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. ఇదే వరుణ్ కు ప్లస్ కానుంది. ఏప్రిల్ 8న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలియ‌జేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది