Veera Simha Reddy Trailer : “ఓంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా..” పూనకాలు తెప్పిస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్..!!
Veera Simha Reddy Trailer : నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ అయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని… చాలా పవర్ ఫుల్ గా బాలయ్యని చూపించాడు. ఫ్యాక్షన్ లీడర్ గా ట్రైలర్ లో బాలయ్య పలికిన డైలాగులు .. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. “ఓంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా..” అనే మాస్ డైలాగ్ తో పాటు ఇంకా పవర్ ఫుల్ డైలాగులు ట్రైలర్ లో ఉన్నాయి. డబల్ క్యారెక్టర్ లో బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు ఒంగోలులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది. అభిమానుల సమక్షంలో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ అందించిన మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. సినిమాలో డైలాగులతో పాటు తమన్ సంగీతం చాలా హైలెట్ అవుతున్నట్లు తాజా ట్రైలర్ బట్టి తెలుస్తోంది. కచ్చితంగా సంక్రాంతికి నందమూరి అభిమానులకు “వీరసింహారెడ్డి” ఫుల్ మీల్స్ అందిస్తుందని ఆశిస్తున్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని టేకింగ్.. అదరగొట్టే రేంజ్ లో కనిపిస్తుంది. సీమలో ఇంకా ఫారెన్ లో సినిమా స్టోరీ నడిపించినట్లు తెలుస్తోంది. భావోద్వేగాకరమైన సన్నివేశాలతో పాటు…మాస్ ఎలివెంట్స్ కి సినిమా యూనిట్ పెద్దపీట వేసినట్లు అర్థమవుతుంది. ట్రైలర్ లో బాలయ్య పెద్ద తరహా పాత్ర.. సినిమా మొత్తానికి హైలైట్ కానున్నట్టు ట్రైలర్ లో విజువల్స్ బట్టి తెలుస్తోంది. “వీరసింహారెడ్డి” ట్రైలర్ నందమూరి అభిమానులకు ప్రజెంట్ పూనకాలు తెప్పిస్తుంది.
