Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు సినిమాలకు ముహూర్తాలు పెడుతూ సినీ సెలబ్రిటీలకు పర్సనల్ జ్యోతిష్యుడుగా వ్యవహరించిన ఆయన సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీల జాతకాలు గురించి చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. యూట్యూబ్లో కూడా పలు ఇంటర్వ్యూలు చేస్తూ పలానా హీరో హీరోయిన్లు ఆ స్థాయిలో ఉందంటే దానికి కారణం తానే అని చెప్పుకుంటుంటారు. అందులో కొంత వరకు నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రష్మిక, ఈశా వంటి హీరోయిన్లకు పూజలు చేస్తున్న వీడియోలు, ఫోటోలు బయటకి వచ్చాయి.
ఇక ఈ మధ్యనే యంగ్ హిరోయిన్ డింపుల్ హయాతి కూడా వేణు స్వామి వద్ద పూజ చేసుకున్న వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్న సమయంలో వీరిద్దరూ జాతకాలు కలవలేదని, వీరు కొద్ది కాలానికే విడిపోతారని వేణు స్వామి చెప్పారు. కానీ అప్పట్లో ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. అయితే కొన్నాళ్లకు అదే నిజమైంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన ఆయన గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతకం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాత్రమే.

ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటారు. అల్లు అర్జున్ ద్వారా నిర్మాతలు భారీ లాభాలను రాబట్టుకుంటారు. అల్లు అర్జున్ జాతకంకు తిరుగులేదు. నిర్మాతలు కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ కు ఇంకో పదేళ్లు తిరుగులేదు. ఆయన సినిమాకు మినిమం 200 కోట్లు వస్తాయి. అయితే వేణు స్వామి చెప్పింది నిజమే అయింది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మొన్ననే అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. దీంతో వేణు స్వామి చెప్పింది నిజమే అని అభిమానులు సోషల్ మీడియాలో ఆయన చేసిన మాటలు వైరల్ చేస్తున్నారు.