Rakul Preet Singh : అతన్ని పెండ్లి చేసుకుంటే రకుల్ జైలు పాలవుతుందట.. వేణుస్వామి సంచలన కామెంట్లు
Rakul Preet Singh ఆయన చెప్పేది జ్యోతిష్యశాస్త్రం. అయితే అందరిలా కాకుండా ఆయన కొంచెం ఫేమస్ జ్యోతిష్యుడు. ఆయన చెప్పే వాటిల్లో చాలా వరకు జరిగిపోతాయని అందరి నమ్మకం. అందుకే ఆయన అంతలా ఫేమస్ అయిపోతున్నారు. కాకపోతే ఆయన ఎక్కువగా సినిమా సెలబ్రిటీల గురించి చెబుతుంటారు. మరీ ముఖ్యంగా మొన్న సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఆయన పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే గతంలో ఆయన వీరి గురించి ఓ సంచలన ప్రకటన చేశాడు. వారికి పెండ్లి కాక ముందే వారు పెళయ్యాక నాలుగేళ్లకు విడిపోతారంటూ చెప్పాడు.

venu swamy About on Rakul Preet Singh marrie
తీరా సరిగ్గా నాలుగేండ్లకు ద సమంత, నాగ చైతన్య విడిపోవడంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన కూడా తాను చెప్పినట్టే జరిగింది చూశారా అంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేశాడు. దీంతో ఇప్పుడు ఆయన వద్దకు మీడియా వారు క్యూ కట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన రకుల్ ప్రీత్ సింగ్ గురించి చేస్తున్న కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. ఆమె రీసెంట్ గానే తనకు కాబోయే వాడి గురించి చెప్పేసింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానిని త్వరలోనే వివాహం చేసుకుంటున్నట్టు చెప్పింది.
Rakul Preet Singh నానా కష్టాలు పడుతుంది…

venu swamy About on Rakul Preet Singh marrie
అయితే వేణు స్వామి ఆమె జోతిష్యం ప్రకారం కొన్ని కామెంట్లు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ గనక జాకీ భగ్నానిని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా జైలుకు వెళ్తుందంటూ చెప్పడం దుమారం రేపుతోంది. రకుల్ ది అలాగే జాకీది జాతకాలు అస్సలు కలవట్లేదని కాబట్టి వీరు పెళ్లి తర్వాత నానా కష్టాలు పడుతారంటూ చెప్పారు వేణు స్వామి. ఒకవేళ పెండ్లికి ఏర్పాట్లు చేసుకుంటే గనక నిశ్చితార్థం అయ్యాక కూడా ఆగిపోయే అవకాశం ఉందంటూ చెప్పేశారు. తన మాట కాదని పెండ్లి చేసుకుంటే రకుల్ కష్టాల పాలు కావాల్సిందే అంటూ హెచ్చరిస్తున్నాడు వేణు స్వామి. దీంతో ఈ కామెంట్లు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిల్లో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో తెలీదు గానీ ఇప్పటికే సమంత విషయంలో ఆయన చెప్పినట్టు జరగడంతో రకుల్ అభిమానులు ఆందోళనలో పడ్డారు.