Viral Video : కూతురితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన నటి లయ.. వైరల్ వీడియో..!
Viral Video : ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్‌గా తన సత్తా చాటిన లయ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పెద్ద హీరోలందరి సరసన నటించింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా నటించి నంది అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. లయ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసిన లయ తన కెరియర్ టాప్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకుంది.పెళ్లి అనంతరం దాదాపు పదేళ్ల తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసారు లయ.
ఈ సినిమాలో లయ కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించడం విశేషం. కాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా లయ తన కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కూతురుతో కలిసి లయ వేసిన స్టెప్పులు తన అభిమానులను ఆకట్టుకున్నాయి. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నటి లయ.. సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ ఉంటుంది. తన కుటుంబానికి సంబంధించి ఫోటలను అభిమానులకు పంచుకుంటూనే ఉంది.స్వయంవరం సినిమాతో తెలుగు చిత్రప్రశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ లయ..

veteran laya dance with her daughter went in Viral Video
Viral Video : కూతురితో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు:
ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో జగపతిబాబు భార్యగా లయని సంప్రదించాడట దర్శకుడు త్రివిక్రమ్.. కానీ అప్పుడే వదిన అమ్మ పాత్రలు చేసందుకు ఇష్టం లేదని, ఆ పాత్రలు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట లయ.. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆ పాత్రకు నటి ఈశ్వరీ రావును తీసుకున్నాడు త్రివిక్రమ్.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది.
View this post on Instagram