Vijay Devarakonda : లైగర్ కోసం రౌడీ పారితోషికం త్యాగం.. హిట్ అవ్వకుంటే ఎంత నష్టమంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vijay Devarakonda : లైగర్ కోసం రౌడీ పారితోషికం త్యాగం.. హిట్ అవ్వకుంటే ఎంత నష్టమంటే..!

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా ను ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ను పూరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయట. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా యొక్క నిర్మాణం […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2022,1:40 pm

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా ను ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ను పూరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయట. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా యొక్క నిర్మాణం పూర్తి అయిన తర్వాతే పారితోషికం తీసుకోవాలని భావించాడట. అందుకే కొద్ద పాటి నామినల్ అమౌంట్ ను పారితోషికం గా తీసుకుని లాభాల్లో వాటాను తీసుకునేందుకు ఒప్పుకున్నాడట.

విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు అయినా కూడా పారితోషికంగా లాభాల్లో వాటాను తీసుకున్నది లేదు. కానీ ఈసారి మాత్రం సినిమా పై నమ్మకం తో ఆయన ఈ పని చేశాడు. ఇప్పటి వరకు కేవలం ఏడు కోట్ల పారితోషికం విజయ్ దేవరకొండ కు అందింట. పారితోషికం విషయం లో త్యాగం చేసిన విజయ్ దేవరకొండ ఒక వేళ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే పది హేను నుండి ఇరవై కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. అంత భారీ పారితోషికం రౌడీ స్టార్ కి దక్కేనా అనేది చూడాలి.

vijay devarakonda liger movie Remuneration

vijay devarakonda liger movie Remuneration

పూరి జగన్నాద్ కూడా ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటాను మాత్రమే తీసుకుంటున్నాడు. ఆయనే స్వయంగా నిర్మాత అయినా కూడా సినిమా కి ఇతర నిర్మాతలు కూడా ఉండటం వల్ల లాభాల్లో వాటాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో నిర్మాతలకు రావాల్సిన మొత్తం దాదాపుగా వచ్చేసినట్లే. అందుకే ఇక నుండి రాబోతున్నది పారితోషికం అవ్వబోతుందట. మరి సినిమా సక్సెస్ అయ్యి విజయ్ దేవరకొండ త్యాగం కి ఫలితం దక్కేనా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఖుషికి గాను 15 కోట్ల పారితోషికం తీసుకున్నాడట.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది