Vijay Deverakonda : బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన లైగర్ టీం.. పార్టీలో ఆ భామతో విజయ్ దేవరకొండ రచ్చ మాములుగా లేదు…!
Vijay Deverakonda : పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందం చిత్రంతో మంచి హిట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. అత్యంత కొద్ది సమయంలోనే మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న స్టార్లలో విజయ్ ఒకరని చెప్పడంలో సందేహం లేదు. అయితే రెండేళ్లనుంచి ఈ రౌడీ హీరో సినిమా రాలేదు. అయితే తన ఫ్యాన్స్‌ను రెండేళ్లు వెయిట్ చేయించిన విజయ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షెన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీతో ఐఫీస్ట్ ఇవ్వనున్నాడు. ఇటీవలే లైగర్ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ఆగస్ట్ 25న సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.
ధర్మ ప్రొడక్షన్ సీఈవో అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో ‘లైగర్’ టీం సందడి చేసింది. ఈ సందర్భంగా బ్లాక్ అండ్ బ్లాక్ లో ఈ యూనిట్ పార్టీలో అట్రాక్టివ్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే మరింత ఆకర్షణీయంగా ఉన్నారు. బ్లాక్ అండ్ బ్లాక్‌లో అందరూ దుమ్మురేపారు. మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. పార్టీ మొత్తంలో లైగర్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రసత్తుం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పార్టీలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ముచ్చటిస్తున్న

Vijay Deverakonda liger looks in black dress
Vijay Deverakonda : లైగర్ టీం రచ్చ మాములుగా లేదు…
సమయంలో ఛార్మీ వీడియో తీయగా, దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే స్టైలిష్‌గా ఎంట్రీ ఇవ్వడంతో లైగర్ టీమ్ అందరినీ ఆకర్షించింది. ఈవెంట్ కోసం బ్లాక్ డ్రెస్ కోడ్‌ను అనుసరించి, చిత్ర బృందం నలుపు రంగు దుస్తులను ధరించి కనిపించింది. అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ బ్లాక్ జాకెట్ మరియు బ్లాక్ ప్యాంట్‌లో స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఫొటోషూట్లలోనూ లైగర్ బ్యూటీ గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. అనన్య అందానికి ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. పైగా బాలీవుడ్ లోనూ ఒక్కోమెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటోందీ బ్యూటీ.
View this post on Instagram