Vishnu Priya : ఎగిరెగిరి తంతోందిగా.. విష్ణుప్రియ వర్కవుట్లు మామూలుగా లేవు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : ఎగిరెగిరి తంతోందిగా.. విష్ణుప్రియ వర్కవుట్లు మామూలుగా లేవు

 Authored By prabhas | The Telugu News | Updated on :9 June 2022,4:30 pm

Vishnu Priya : విష్ణుప్రియ బుల్లితెరపై ఎంత సందడి చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ అడ్రస్ లేకుండా పోయింది. బుల్లితెరపై ఆమె కనిపించడం లేదు. మునుపటిలా ఆమె రెగ్యులర్‌గా ఏ ప్రోగ్రాం కూడా చేయడం లేదు. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం బుల్లితెరకు దూరమైనట్టు తెలుస్తోంది. అయితే మధ్య మధ్యలో మాత్రం అలా స్పెషల్ స్కిట్లలో మెరుస్తుంటుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో డ్యాన్సులు, జబర్దస్త్ షోలో కామెడీ చేసేందుకు వస్తుంటుంది.కానీ చెప్పుకోవడానికి ఓ షో అంటూ లేకుండా పోయింది. రెగ్యులర్‌గా విష్ణుప్రియ బుల్లితెరపై కనిపించడం లేదు. దానికి కారణాలు కూడా తెలియడం లేదు.

విష్ణుప్రియే వాటికి దూరంగా ఉంటోందా.. లేదంటే విష్ఱుప్రియను దూరం పెట్టారా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు. అయితే ఆధ్యాత్మిక చింతన వల్లే తానే ఓ ఏడాది పాటు బుల్లితెరకు దూరంగా ఉన్నానని విష్ణుప్రియ ఓ సారి చెప్పుకొచ్చింది. పాతికేళ్ల వయసులో ఎంత సంపాదించాలో.. అంతకంటే ఎక్కువే సంపాదించానని, ఇకపై తాను జీవితాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఆధ్యాత్మిక వైపు మళ్లానని అంది. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం ఇప్పుడు ఎక్కువగా సద్గురుని ఫాలో అవుతుంటుంది. ఈషా ఫౌండేషన్ కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటుంది. అలానే రుద్ర అనే మరో ఫౌండేషన్‌ను పెట్టి..

Vishnu Priya Cardio workout Goes Viral

Vishnu Priya  Cardio workout Goes Viral

సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది విష్ణుప్రియ. మొత్తానికి వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడు అనే సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియ వంటి వారు నటిస్తున్నారు. మరి ఈ చిత్రంతో విష్ణుప్రియకు మైలేజ్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం విష్ణుప్రియ తెగ వర్కవుట్లు చేస్తోంది. తాజాగా ఆమె తన కాలుతో ఎగిరెగిరి తంతోంది. కార్డియో టైపు వ్యాయాయం అంటూ ఇది రెండో రోజు అంటూ విష్ణుప్రియ ఆ వర్కవుట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అందులో విష్ణుప్రియ పొట్టి బట్టల్లో కవ్వించేస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది