Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్. హాలీవుడ్ నటులు కూడా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు. అది ఆయన రేంజ్. సీరియల్స్ నుంచి దిగ్గజ దర్శకుడిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనుక అనేక సంవత్సరాల రాజమౌళి కృషి ఉంది. రాజమౌళి ఏ సినిమా తీసినా.. ఆ సినిమాకు ఒక అర్థం ఉంటుంది. దాంట్లో ఒక పరమార్థం దాగి ఉంటుంది.అసలు తెలుగు సినిమా మార్కెట్ ను అమాంతం పెంచేశారు రాజమౌళి. అప్పటి వరకు వంద కోట్ల మార్కెట్ కూడా లేదు.
కానీ.. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా మార్కెట్ ను మూడు నాలుగు వందల కోట్లకు పెంచి.. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అన్ని వందల కోట్లు పెట్టి ఏ సినిమా తీయలేదు అప్పటి వరకు. బాహుబలి సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను అనుకున్న విషయం తెలిసిందే కదా. కేవలం బాహుబలి వన్ సినిమా కోసమే రూ.180 కోట్ల అప్పు చేశారని తాజాగా బాహుబలి లెక్కలను రానా దగ్గుబాటి బయటపెట్టారు.బాహుబలి వన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు సాధించింది. అయినా బాహుబలి నిర్మాతకు రూపాయి రాలేదు. ఇంకా అప్పు కూడా అలాగే ఉంది. అయినా బాహుబలి 2 షూటింగ్ ను ప్రారంభించారు.

Rajamouli : రూ.600 కోట్ల వసూళ్లు సాధించినా నిర్మాతకు రూపాయి రాలేదు
బాహుబలి 2 ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే మాత్రం నిర్మాత ఘోరంగా నష్టపోయేవారు. అలాగే.. రాజమౌళి కూడా కోలుకునే వారు కాదు అంటూ రానా ఈ సినిమా లెక్కలను చెప్పుకొచ్చారు. నిజానికి బాహుబలి 2 సినిమా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. దీంతో అప్పులు పోను నిర్మాతకు లాభాలు వచ్చాయట. బాహుబలి సక్సెస్ తోనే.. ఆర్ఆర్ఆర్ సినిమాను మరోసారి ధైర్యం చేసి రాజమౌళి మళ్లీ వందల కోట్ల బడ్జెట్ తో తీశారు. అందుకే ఆ సినిమాకు ఆస్కార్ వచ్చింది. ఇక రాజమౌళి తదుపరి మూవీకి బడ్జెట్ ఏకంగా వెయ్యి కోట్లు. ఈ అడ్వెంచర్ మూవీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.