Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి నందు, లాస్య వెళ్లిపోయాక.. తులసి షాకింగ్ నిర్ణయం.. చంద్రకళ ఇంటిని స్వాధీనం చేసుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి నందు, లాస్య వెళ్లిపోయాక.. తులసి షాకింగ్ నిర్ణయం.. చంద్రకళ ఇంటిని స్వాధీనం చేసుకుంటుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :3 April 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, ఏప్రిల్ 4 ఎపిసోడ్ 597 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా సంగతి పక్కన పెట్టండి.. ఒక్కసారి మీ గురించి మాట్లాడుకుందామా నంద గోపాల్ గారు అంటుంది తులసి. దీంతో విషయాన్ని డైవర్ట్ చేస్తున్నావు తులసి అంటుంది లాస్య. దీంతో అస్సలు కాదు.. నీ భర్త తేనెతుట్టను కదిపాడు అంటుంది. భర్తగా, కొడుకుగా, తండ్రిగా మీ ఫెయిల్యూర్స్ కూడా చెప్పమంటారా నందగోపాల్ గారు అంటుంది తులసి. ఎంతైనా  మాజీ భర్త, ఆయన కట్టిన తాళి కూడా మెడలో ఉంచుకున్నాను. ఆయన భార్యగా నాది పాతికేళ్ల సర్వీస్. ఏ ఒక్క రోజు నన్ను బయటికి తీసుకెళ్లింది లేదు అంటుంది తులసి.

What tulasi will do after nandu and lasya steps out of the house

What tulasi will do after nandu and lasya steps out of the house

ఏ ఒక్క రోజు సినిమాకు, షికారుకు తీసుకెళ్లింది లేదు. ఏ ఒక్క రోజు వెన్నెల్లో కూర్చోబెట్టి నాకు ముచ్చట్లు చెప్పింది లేదు. ఏ ఒక్క రోజు నా వంటను కానీ.. నా అందాన్ని కానీ.. నా పనితనాన్ని కానీ మెచ్చుకున్నది లేదు. భార్య అంటే ఆయన ముందు ఉండే లాప్ టాప్. ఆయన చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. భార్య అంటే ఆయన దృష్టిలో ఒక డోర్ మ్యాట్. మనకు అవసరం అయినప్పుడు డోర్ మ్యాట్ కొంటాం. డోర్ మ్యాట్ కు అవసరాలు ఉండవు. ఆయన కూడా తన అవసరాలకు నన్ను అలాగే వాడుకున్నారు.. అంటుంది తులసి.

నేను కిక్కురుమనలేదు. భార్యను కదా.. కేవలం మీతో పాటు మీ సోషల్ సర్కిల్ లో ఇమడలేను అనే చిన్న కారణం వల్ల పాతికేళ్ల జీవితానికి స్వస్తి పలికారు. నూరేళ్ల జీవితాన్ని బుగ్గి చేశారు. నన్ను వదిలించుకొని ఇంకొక ఆడదాని మెడలో తాళి కట్టారు. భర్తగా మీరు అతిపెద్ద ఫెయిల్యూర్ అంటుంది తులసి.

ఇక తండ్రిగా మీ గొప్పదనం కూడా వింటారా? పిల్లల కష్టసమయాల్లో ఎప్పుడూ తండ్రిగా మీరు పక్కన లేరు. దివ్య కిడ్నాప్ అయినప్పుడు మీరు లాస్యతో రిసార్ట్ లో  ఉన్నారు. ప్రేమ్ అరెస్ట్ ను పట్టించుకోలేదు. అభిని అరెస్ట్ చేసినా పట్టించుకోలేదు.

తండ్రిగా మీరు చాలా పెద్ద ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటారా? మామయ్య ఆపరేషన్ కోసం చేసిన అప్పుకు కూడా లెక్కలు అడుగుతూ సంబంధం లేకుండా పారిపోతున్నారు. ఇదేనా కొడుకుగా మీ బాధ్యత. పొరపాటున మామయ్య, అత్తయ్య మీతో వస్తే ఏదైనా జరిగితే దేవుడి మీద భారం వేసి కూర్చుంటారా?

Intinti Gruhalakshmi : నేను తండ్రిగా ఫెయిల్యూర్ అయ్యానంటే దానికి కారణం నువ్వే అని తులసితో అన్న నందు

ఎవరో ఏదో అనుకుంటారని.. నువ్వు అత్తయ్య, మామయ్యలను తీసుకెళ్లడం కాదు. వాళ్ల మీద ఇష్టం ఉండాలి. తీసుకెళ్లాలనే బాధ్యత ఉండాలి అంటుంది తులసి. దీంతో  నిన్ను నేను దూరం పెట్టినప్పటి నుంచి నా పిల్లలకు నా మీద ద్వేషం పెంచావు అంటాడు నందు.

తండ్రిగా నేను ఫెయిల్యూర్ అయ్యానంటే దానికి కారణం నువ్వే. సంపాదిస్తున్నాను అనే అహంకారం నీ కళ్లు నెత్తికెక్కేలా చేస్తోంది. ఇలాగే ప్రవర్తిస్తే జీవితంలో దెబ్బతింటావు. మగ తోడు లేని ఆడదానికి సమాజం ఇచ్చే విలువ ఏంటో మేము గడప దాటి వెళ్లాక నీకే తెలుస్తుంది అంటాడు నందు.

నాకు చదువు లేకున్నా.. నేను నా కాళ్ల మీద నిలబడుతున్నాను అంటుంది తులసి. కబుర్లు చెప్పినంత ఈజీ కాదు అంటాడు నందు. ఆ తర్వాత లాస్యను తీసుకొని బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత తాతయ్య, నానమ్మ ఇంటికి వెళ్లాక ఏమైందో అని శృతితో అంటాడు ప్రేమ్.

ఇంతలో రాములమ్మ వచ్చి మీ నాన్న గారు వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు అంటుంది రాములమ్మ. పెద్దయ్య గారిని అమ్మ గారు పంపించను అని ఖరాఖండిగా చెప్పేశారు అంటుంది రాములమ్మ. మేము కూడా ప్రేమ్ లక్ష్యాన్ని చేరుకున్నాకనే ఆ ఇంట్లో అడుగుపెడతాం అంటుంది శృతి.

మరోవైపు చంద్రకళ.. తులసి ఇంటికి వస్తుంది. అమ్మీ అంటుంది. నీ మాజీ మొగుడు నీతో పాటు ఈ ఇంటిని కూడా వదిలి వెళ్లాడట కదా. నా మాట వింటే నీ చేతికి 20 లక్షలు వస్తుంది అంటుంది చంద్రకళ. నా అప్పు తీరిపోతుంది. కాకపోతే ఈ ఇల్లు నాది అవుతుంది అంటుంది చంద్రకళ.

ఆ తర్వాత భాగ్య వచ్చి ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో.. నీ తోటి కోడలను నాకూ అంతే హక్కు ఉంది తులసి అక్క అంటుంది భాగ్య. అమ్మే అధికారం నీకు లేదు అంటుంది భాగ్య. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది