Sankranthi : సంక్రాంతి 2023 బాక్స్ ఆఫీస్ విజేత ఎవరు అనేది మీ ప్రశ్న అయితే ఈ న్యూస్ చదవండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranthi : సంక్రాంతి 2023 బాక్స్ ఆఫీస్ విజేత ఎవరు అనేది మీ ప్రశ్న అయితే ఈ న్యూస్ చదవండి..!!

 Authored By kranthi | The Telugu News | Updated on :19 January 2023,1:00 pm

Sankranthi : వేరే రాష్ట్రాల్లో ఎలా చేస్తారో కానీ.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉంది. ఈ పండుగను ఏపీ ప్రజలు కుటుంబ సమేతంగా జరుపుకుంటారు. కోళ్ల పందేలు, ఆటా పాటలు, ముగ్గుల పోటీలు, డూడూ బసవన్నలు, పిండి వంటలు ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా ఉన్నాయి. ఏపీలో పండుగ అంటే సంక్రాంతి అన్నట్టుగా వేడుకలు జరుగుతాయి. అందుకే తెలుగు ప్రజలకు సంక్రాంతి అంత స్పెషల్. తెలంగాణలోనూ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు నిర్వహించుకుంటారు.

అందుకే.. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు కూడా విడుదల కావడం ఆనవాయితీగా వస్తూ ఉంది.ఖచ్చితంగా సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద సినిమాలు విడుదల కావాల్సిందే. ఈసారి కూడా సంక్రాంతికి బాక్సాఫీసును వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఢీకొట్టారు. ఇద్దరూ పెద్ద హీరోలే. ఓవైపు మెగాస్టార్, మరోవైపు నటసింహ. దీంతో ఈసారి సంక్రాంతి పండుగ వీళ్లిద్దరి సినిమాలతో ప్రారంభం అయింది. ఓవైపు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేసి బాలయ్య అదరగొట్టేశాడు. మరోవైపు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వాల్తేరు వీరయ్యగా వచ్చి చిరంజీవి కూడా అలరించారు.

who is the sankranthi winner from two telugu movies

who is the sankranthi winner from two telugu movies

Sankranthi : ఇద్దరిలో ఎవరు టాప్ లో నిలిచారు?

అయితే.. బాక్సాఫీసు వద్ద చూసుకుంటే.. నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. ఎవరు టాప్ లో నిలిచారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయితే.. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా వాల్తేరు వీరయ్య కంటే ఒక రోజు ముందే జనవరి 12న విడుదల అయింది. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. రూ.104 కోట్లు కలెక్ట్ చేసింది. అదే వాల్తేరు వీరయ్య మూవీ మూడు రోజుల్లోనే రూ.108 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే.. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్యనే సంక్రాంతి విజేతగా నిలిచింది అని చెప్పుకోవచ్చు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది