Hello Brother : ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించింది పెద్ద స్టార్ హీరో అని తెలుసా?
Hello Brother : హలో బ్రదర్ సినిమా గురించి తెలుసు కదా. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. ఆ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. డబుల్ యాక్షన్ తో ఫుల్ టు ఎంటర్ టైనర్ గా వచ్చిన ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకుపోయింది. సినిమా మొత్తం ఆధ్యంతం నవ్వులు పూయిస్తుంది.ఆ సినిమాలో స్పెషల్ ఏంటంటే.. నాగార్జున డబుల్ యాక్షన్ రోల్ లో నటించడం. ఒక సినిమాలో హీరో డబుల్ యాక్షన్ అంటే అంత ఈజీ కాదు.
ఆ హీరో పోలికలతో.. సేమ్ హైట్.. సేమ్ పర్సనాలిటీతో ఉన్న మరో వ్యక్తిని డూప్ గా పెట్టాల్సి ఉంటుంది. సినిమాలో మాత్రం నాగార్జున ముఖాన్నే చూపిస్తారు.1994 లో వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్ గా నటించింది మరెవరో కాదు. శ్రీకాంత్. అవును.. హీరో శ్రీకాంత్ నే.. నాగార్జునకు డూప్ గా ఆ సినిమాలో చేయించారు. ఈ సినిమా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చింది.

who is the star hero who did dupe in hello brother movie for nagarjuna
Hello Brother : తెలుగు స్టార్ హీరోనే నాగార్జునకు డూప్ గా నటించాడు
నాగార్జున ప్లేస్ లో ఖచ్చితంగా వేరే వ్యక్తి కావాలని ఈవీవీ చెప్పారట. దీంతో నాగార్జున బాడీకి సరిపోయే వ్యక్తి కోసం వెతుకుతుండగా.. అదే సినిమా షూటింగ్ పక్కనే హీరో శ్రీకాంత్ కూడా షూటింగ్ చేస్తున్నాడట. అతడిని చూసిన ఈవీవీ.. హలో బ్రదర్ సినిమాలో శ్రీకాంత్ పాత్ర కోసం అడిగాడట. దీంతో శ్రీకాంత్ కూడా డూప్ కోసం ఒప్పుకున్నాడట. అలా ఆ సినిమాలో శ్రీకాంత్.. నాగార్జునకు డూప్ గా నటించాల్సి వచ్చింది.