Bigg Boss OTT Telugu : అనిల్ రాథోడ్ ను ఎందుకు అషూ రెడ్డి టార్ఛర్ పెడుతోంది.. కారణం అదేనా?
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ లో అప్పుడే రెండు వారాలు అయిపోయాయి. ఇక.. మూడో వారం నామినేషన్లు కూడా అయిపోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపకను పంపించేశారు. దీంతో హౌస్ లో ఇక 15 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటి వరకు వారియర్స్ టీమ్ నుంచి ఒకరు.. చాలెంజర్స్ టీమ్ నుంచి ఒకరు.. ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.ఇక.. మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో హాట్ హాట్ టాపిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్స్ గా కొందరు విడిపోయారు. ఎవరికి నచ్చిన వారితో వాళ్లు ఉంటున్నారు.
లవ్ ట్రాక్స్.. ఇలా అన్నీ నడుస్తున్నాయి బిగ్ బాస్ హౌస్ లో.రోజురోజుకూ బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బిగ్ బాస్ ఓటీటీకి బాగానే ఆదరణ లభిస్తోంది. అందులోనూ 24 గంటలు షో నడుస్తూనే ఉంటుంది కాబట్టి.. హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సంచలనం సృష్టిస్తున్న మరో అంశం ఏంటంటే.. అనిల్ రాథోడ్, అషు రెడ్డి మధ్య రిలేషన్ షిప్. నిజానికి వాళ్ల మధ్య ఏం రిలేషన్ షిప్ ఉందో దేవుడికే తెలియాలి కానీ.. ఇద్దరు మధ్య మాత్రం శతృత్వం బాగానే ఉన్నట్టుంది.
 
why ashu reddy targeted anil rathod in bigg boss ott telugu
Bigg Boss OTT Telugu : అనిల్ రాథోడ్ వర్సెస్ అషురెడ్డి
అంట్లు తోమే దగ్గర.. ఇంకా వేరే విషయాల్లో అనిల్ రాథోడ్ ను అషు టార్చర్ పెడుతోందంటూ అరియానా చెప్పడంతో మిగితా కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.ఈ అషుకు ఏం పని ఉండదా? ఎప్పుడూ మేకప్ వేసుకోవడమేనా. వేరే వాళ్ల పంచాయితీల్లో వేలుపెట్టడం.. గంటలు గంటలు మేకప్ వేసుకోవడం.. అషుకు ఇదే పని ఎప్పటికీ. అనిల్ కెప్టెన్ అయ్యాడు కదా.. అషు మహారాణిలా తిరుగుతుంది అనుకున్నా కానీ.. అనిల్ నే టార్చర్ పెడుతోంది అషు.. అంటూ బిగ్ బాస్ ఇలా అనుకుంటాడు అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది అరియానా.
 
 
                               
                       
                       
                     
                     
 
 
 
 
 
 
