Gemini TV : జెమిని టీవీ రేటింగ్ దారుణంగా పడిపోవడంకు కారణం ఇదేనా?
Gemini TV : ప్రస్తుతం తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు స్టార్ మా టీవీ, జీ తెలుగు టీవీ, మరియు ఈటీవీ తప్పితే ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లు కూడా కనిపించడం లేదు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ రంగంలో ఈ మూడు చానల్స్ రేటింగ్ విషయంలో పోటీ పడుతున్నాయి. కానీ వీటన్నింటి పై ఒకానొక సమయంలో టాప్ పొజిషన్ లో నిలిచిన జెమిని టివి మాత్రం ఇప్పుడు కనీసం పోటీ పడలేక పోతోంది. జెమినీ టీవీ సీరియల్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ కార్యక్రమాలను చేయక పోవడం ద్వారా ఈ స్థాయికి పడిపోయింది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న జెమినీ టీవీ యాజమాన్యం సీరియల్స్ విషయంలో మరియు రియాల్టీ షోల విషయంలో మాత్రం ఎలాంటి జాగ్రత్త తీసుకోవడం లేదు.
కొన్ని సీరియల్స్ ను డైరెక్ట్ గా తెలుగులోనే తెరకెక్కించినా కూడా అత్యంత దారుణమైన స్క్రీన్ప్లే తో సాగా తీసినట్లుగా సీరియల్స్ ఉంటున్నాయి. దాంతో ప్రేక్షకులు జెమినీ టీవీ సీరియల్స్ అంటేనే బాబోయ్ అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జెమినీ టీవీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ తో ఎవరు కోటీశ్వరులు చేయించడం జరిగింది. అది దారుణమైన ప్లాప్ ను మూట కట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి మాస్టర్ చెఫ్ షో ని తమన్నా హోస్ట్గా చేయించడం జరిగింది. అది కూడా అత్యంత దారుణమైన పరాజయం పాలవడం వెళ్ళిపోవడం వంటివి జరిగాయి. మొత్తానికి జెమినీ టీవీ కి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ అనేది రావడం లేదు. జెమిని టివి వారు ఇప్పటికి కూడా భారీగా రేటింగ్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

why gemini tv not going well in telugu states
కానీ ఖర్చయితే పెడుతున్నారు అది ఒక ప్రాపర్ గా పెట్టడం లేదు అనేది టాక్ ఉంది. జెమినీ టీవీ తమిళనాడుకు చెందిన నెట్వర్క్ ఛానల్ అనే విషయం తెలిసింది. సన్ నెట్వర్క్ ఛానల్ లు అన్ని కూడా తమిళనాట సూపర్ హిట్.. టాప్ పొజిషన్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం జెమిని టీవీ ని వారు పట్టించుకోక పోవడంతో ఇలా అయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ మా టివి కి జెమినీ టీవీ కి పోటి ఒక సమయంలో ఉండేది. ఇప్పుడు రెండిటి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ టాక్ వినిపిస్తుంది.