Gemini TV : జెమిని టీవీలో కామెడీ షో పనులు ఎంత వరకు వచ్చాయి?
Gemini TV : ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్ ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలు మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. జబర్దస్త్ కు ఈమద్య కాలంలో కాస్త ఆధరణ తగ్గినా కూడా ఇతర ఛానల్స్ కామెడీ షో లకు పెద్దగా స్కోప్ లేకుండా ప్రేక్షకులు కేవలం జబర్దస్త్ నే ఎక్కువగా ఆధరిస్తున్నారు. బుల్లి తెరపై జబర్దస్త్ కు దక్కుతున్న గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆ షో కు పోటీ అన్నట్లుగా మరో కామెడీ షో కు రంగం సిద్దం అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
కొన్ని వారాల క్రితం జెమిని టీవీలో ఒక కామెడీ షో కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి అనే వార్తలు వచ్చాయి. జెమిని టీవీ వర్గాల వారు కూడా ఆ విషయాన్ని అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. జెమిని టీవీ రేంటింగ్ ను పెంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం అన్నారు. కనుక ఖచ్చితంగా వారు జబర్దస్త్ తరహా కామెడీ షో ను ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టం అయ్యింది. తప్పకుండా జెమిని టీవీలో త్వరలోనే కామెడీ షో వస్తుందని ఎదురు చూసిన కామెడీ ప్రియులకు నిరాశే మిగిలింది. వారు ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

gemini tv comedy show update
జెమిని టీవీ ఈమద్య కాలంలో అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. దాదాపుగా మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న జెమిని టీవీ ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం విచారకరం. అందుకే జబర్దస్త్ వంటి కార్యక్రమంను తీసుకు రావడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జెమిని టీవీ కంటే ముందు స్టార్ మా మరియు జీ తెలుగు ఛానల్స్ జబర్దస్త్ ను ట్రై చేశాయి. జీ తెలుగు ప్లాప్ అవ్వగా స్టార్ మా ఇంకా కామెడీ స్టార్స్ పేరుతో కామెడీ షో ను కంటిన్యూ చేస్తూనే ఉంది. కనుక జెమిని వారు కాస్త వెనకడుగు వేస్తున్నారేమో అనిపిస్తుంది.