Gemini Tv : తెలుగు బుల్లితెర.. జెమిని టీవీ వస్తుందా? లేదా?
Gemini Tv : తెలుగు బుల్లి టెలివిజన్ రంగం ప్రారంభం అయ్యింది దూరదర్శన్ తో అయినా కూడా జెమిని టీవీ తో అత్యంత ఆధరణ బుల్లి తెరకు దక్కింది అనడంలో సందేహం లేదు. 1995 ఫిబ్రవరిలో తమిళనాడుకు చెందిన కళానిధి మారన్ సన్ నెట్ వర్క్ గ్రూప్ ను ప్రారంభించి అందులో జెమిని టీవీని ప్రారంభించడం జరిగింది. అప్పటికే తమిళనాట కూడా ఆయన శాటిలైట్ ఛానల్స్ ను మొదలు పెట్టాడు. జెమిని టీవీ తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. జెనిమి టీవీ ప్రారంభం అయిన కొన్ని నెలల తర్వాత ఈటీవీ ప్రారంభం అయ్యింది.
దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఈ రెండు ఛానల్స్ మాత్రమే తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాయి. ఈ రెండు ఛానల్స్ లో జెమిని నెం.1 గా ఉండగా ఈటీవీ నెం.2 గా ఉంటూ వచ్చింది. స్టార్ మా మరియు జీ తెలుగు వచ్చిన తర్వాత స్థానాలు మారుతూ వచ్చాయి. ఆ రెండు ఛానల్స్ వచ్చిన సమయంలో కూడా చాలా కాలం పాటు జెమిని టీవీ నెం.1 గానే కొనసాగింది. ఎప్పుడైతే ఇతర ఛానల్స్ రియాల్టీ షో లు మొదలు పెట్టిందో.. జెమిని టీవీ మూస సీరియల్స్ తో బొర్ కొట్టించిందో అప్పటి నుండి జెమిని టీవీ ప్రస్థానం పథనం వైపుగా అడుగులు వేసింది.
ఇప్పుడు జెమిని టీవీ స్థానం ఏంటీ అంటే ఇంకా జెమిని టీవీ ఉందా అంటూ కొందరు అడిగే స్థాయికి ఆ ఛానల్ పడిపోయింది. ఆ మద్య ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో తో జెమిని పేరు కాస్త వినిపించింది. ఇప్పుడు ఆ మాత్రం కూడా సందడి చేయక పోవడంతో మొత్తానికి జెమిని టీవీ ప్రస్థానం ముగిసినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది. సన్ నెట్ వర్క్ వాళ్ల ఇతర ఛానల్స్ భారీగా ఆదాయం రాబడుతున్న కారణంగా జెమిని టీవీ లాభం లేకున్నా కొనసాగుతుంది. అయితే ఎన్నాళ్లు ఇలా కొనసాగుతుంది అనేది చూడాలి.