Samantha : సమంత చెప్పుల గురించి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు .. ఇవి చైతన్య కొన్నాడా ?
Samantha : ఇటీవల సినిమా సెలబ్రిటీలు వేసుకుంటున్న దుస్తులు మరియు చెప్పులు, వాచీలు వాటికి సంబంధించిన ఖరీదులు తెలుసుకొని అందరూ అవాకవుతున్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ చాలామంది గురించి రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్ సమంత ఖుషి సినిమా కోసం టర్కీ వెళ్లగా ఆమె.. అక్కడ విమానాశ్రయంలో కొంతమందికి దర్శనమిచ్చింది. ఆ సమయంలో ఫోటోలు తియ్యగా సమంత ధరించిన చెప్పుల ఖరీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే సమంత ధరించిన చెప్పుల ఖరీదు దాదాపు రెండు లక్షల రూపాయలకు పై మాటే అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినవారు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ అనే పెద్ద కంపెనీకి చెందినవి. ఇటీవల లండన్ వెళ్లిన సమయంలో సమంత అక్కడ ఈ చెప్పులు తీసుకుందని సమాచారం.
సమంత చెప్పులు టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా ఉండటంతో కొంతమంది అవి ఏమైనా నాగచైతన్య కొనిచ్చాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం పూర్తిగా మయోసైటీస్ అనే వ్యాధి నుండి కోలుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వ్యాధికి సంబంధించి పవర్ ఫుల్ చికిత్స తీసుకున్న సమంత ఇటీవల కోలుకోవడం జరిగింది. మళ్లీ యధావిధిగా గతంలో మాదిరిగా షూటింగ్ లలో బిజీ అవుతూ కనిపిస్తుంది.