Jr NTR : జూనియర్ ఎన్‌టి‌ఆర్ సైలెంట్ గా ఉండడం వెనక .. బ్యాక్ వర్క్ జరుగుతున్నట్టా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : జూనియర్ ఎన్‌టి‌ఆర్ సైలెంట్ గా ఉండడం వెనక .. బ్యాక్ వర్క్ జరుగుతున్నట్టా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 August 2022,8:00 am

Jr NTR : మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అక్కడి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి కోమటిరెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం ఇప్పుడు తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ చర్చనీయాంశం అయింది. అసలు మునుగోడుతో, బీజేపీతో ఎలాంటి సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా ఎందుకు కలిశారు అనేదానిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరిగింది. చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ కొడాలి నాని..

ఆయన రాజకీయాల్లోకి రావాలని.. టీడీపీ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ పార్టీకి ఏపీలో కాస్తో కూస్తో ప్రస్తుతం ఆదరణ ఉంది. కానీ.. చంద్రబాబు నాయుడు చేసే పనుల వల్ల ఇంకొన్ని రోజుల్లో ఆ పార్టీ మనుగడే కష్టం కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబును బీజేపీ కూడా నమ్మడం లేదు. అందుకే.. జూనియర్ ఎన్టీఆర్ ను కాకా పట్టడానికే అమిత్ షా ఆయన్ను కలిశారా అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.

why tdp is silent on jr ntr meeting with amit shah

why tdp is silent on jr ntr meeting with amit shah

Jr NTR : టీడీపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది

జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ మీద ఎలాంటి కామెంట్స్ చేయకూడదని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలందరికీ సూచించారట. ఒకవేళ ఏదైనా కామెంట్ చేస్తే అది వైసీపీకి మైలేజ్ అవుతుందని చంద్రబాబు భావించి ఉంటారు. అంతే కాదు.. టీడీపీలోని కొందరు నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకోవాలంటూ చంద్రబాబును ఒత్తిడి చేస్తుండటం చంద్రబాబుకు అస్సలు నచ్చడం లేదు. నిజానికి… తన కొడుకు లోకేశ్ ను తదుపరి టీడీపీకి వారసుడిగా ప్రకటించేందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్..

ఇప్పుడు చంద్రబాబుకు మేకై కూర్చొన్నాడు. పలు మీటింగ్స్ లోనూ టీడీపీ నేతల నుంచే ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపించాయి. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతగా పాలిటిక్స్ మీద ఆసక్తిగా లేనట్టు కనిపిస్తోంది. అయితే.. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా మధ్య ఏం డిస్కషన్ జరిగింది అనేది మాత్రం తెలియదు. ఒకవేళ టీడీపీ జూనియర్ సొంతం అయితే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని ముందే ఊహించి జూనియర్ తో బీజేపీ సత్సంబంధాలు నెరుపుతోందా? లేక భవిష్యత్తులో జూనియర్ ను బీజేపీలోకి అమిత్ షా ఆహ్వానించారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది