Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన తులసి.. ప్రేమ్ దగ్గరికే వెళ్తుందా? నందు, లాస్య కూడా వెళ్లిపోతారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన తులసి.. ప్రేమ్ దగ్గరికే వెళ్తుందా? నందు, లాస్య కూడా వెళ్లిపోతారా?

 Authored By gatla | The Telugu News | Updated on :27 March 2022,9:42 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ 28 మార్చి 2022, 591 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జీవితం అంటే అమ్మ కొంగు పట్టుకొని తిరగడం కాదు.. నలుగురు చెప్పుకునేలా ఎదగాలి అంటూ ప్రేమ్ ను నిలదీస్తుంది తులసి. మీ నాన్న అన్నమాటలనే నిరూపించావు. చేతగాని వాడినని నిరూపించావు అంటుంది తులసి. పెద్ద మగాడిలా చేతులు మడుస్తావు. తండ్రిని ఎదిరిస్తావు కానీ.. తండ్రిని మించి బతకవా. తలవంచుకునేలా చేశావు కదరా అంటుంది తులసి. రేపు ఇంకా పెద్ద కష్టం వస్తే ఏం చేస్తావు. జీవితానికి చావు కాదు ముగింపు. ఒక విధంగా నీ జీవితం ముగిసిపోయినట్టే.. అంటుంది తులసి.

will prem stop driving auto and focus on his music in intinti gruhalakshmi

will prem stop driving auto and focus on his music in intinti gruhalakshmi

ఇంట్లో నుంచి తరిమేశాను కాబట్టి.. నీ బతుకు నీతి.. నీకు ఆ ఇంటికి సంబంధం లేదు అనుకుంటున్నావా? ఈఅమ్మకు నిన్ను అడిగే హక్కు లేదనుకుంటున్నావా? అలా అనిపిస్తే ముందే చెప్పు. నీ జోలికి రాను. ఆ అమ్మకు ఒక్కడే కొడుకు అనుకుంటానురా అంటుంది తులసి. దీంతో అలా అనకు అమ్మ. నువ్వు కావాలి అమ్మ అంటాడు ప్రేమ్. దీంతో ఇలాంటి కొడుకు నాకు అక్కర్లేదు అంటుంది తులసి. దీంతో ప్రేమ్ ఏడుస్తాడు. ఎందుకురా ఆ కన్నీళ్లు. అమ్మ వద్దంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? అమ్మ వద్దంటే కన్నీళ్లు పెట్టుకోవడం కాదు. అనుకున్నది సాధించకపోతే కన్నీళ్లు పెట్టకోవాలి అంటుంది తులసి.

జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసా? నిన్ను దూరం చేసుకునే వాళ్లు అయ్యో ఇలాంటి ప్రయోజకుడిని దూరం చేసుకున్నామే అని అనుకోవాలి. ఆంటి ప్రేమ్ బాధను అర్థం చేసుకోకుండా బాధపెడుతున్నారు అంటుంది శృతి. దీంతో వాడి బాధకన్నా.. నేను అంతకంటే ఎక్కువ బాధను మోస్తున్నాను అంటుంది తులసి.

జీవితంలో గెలవాలి అనుకునే వాడు ఓటమికి కారణాలు వెతుక్కోడు.. అంటుంది తులసి. ఇప్పటికైనా ఓడిపోయావని ఒఫ్పుకున్నారు. లేకపోతే నా బిడ్డ ఏదో సాధిస్తాడనే భ్రమలో బతికేవాడిని. నువ్వేంటో నాకు మీ నాన్న గారు తెలిసేలా చేశారు అంటుంది తులసి.

చాలా కఠినంగా మాట్లాడుతున్నారు ఆంటి అంటుంది తులసి. దీంతో నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అంటుంది తులసి. నేను ఓడిపోలేదు.. చచ్చిపోయాను అంటుంది తులసి. మాధవిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

Intinti Gruhalakshmi : ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పిన నందు

ఆ తర్వాత ఇంటికి వెళ్లి పరందామయ్యకు జరిగిన విషయం చెబుతుంది. ఇంతలో నందు వచ్చి ఈ ఇంట్లో తనకు ఎలాంటి విలువ లేదని.. తాను, లాస్య ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతామని చెబుతాడు. అలాగే.. పరందామయ్య, అనసూయను కూడా తీసుకొని వెళ్తామని చెబుతాడు.

దీంతో అందరూ షాక్ అవుతారు. మేము రాము అని ఖరాఖండిగా చెబుతాడు పరందామయ్య. మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే.. మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాం. ఈ విషయంలో తులసి నిర్ణయంతో సంబంధం లేదు. మా నిర్ణయమే చెందుతుంది అంటుంది అనసూయ.

ఆ తర్వాత అమ్మానాన్నలను ఎలాగైనా ఒప్పించాలని తులసిని కోరుతాడు నందు. అమ్మానాన్నలను వదిలేసి తన స్వార్థం చేసుకున్నాడని సమాజం నన్ను వేలెత్తి చూపించకుండా ఉండేందుకు నువ్వే వాళ్లను ఒప్పించాలి అంటాడు నందు.

దీంతో ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు తులసి రెడీ అవుతుంది. దీంతో పరందామయ్య, అనసూయ.. నువ్వు వెళ్లడం ఎందుకు.. మేమే నందుతో వెళ్తాం అంటారు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది