Bunny Vasu : నిర్మాత మోసం చేశాడంటూ గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు యువతి అర్ధనగ్న ప్రదర్శన
Bunny vasu : గత కొంత కాలంగా సినీ నిర్మాత బన్నీ వాసు పై సునీత బోయ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నారని, డ్రగ్స్ ఎక్కించారని తీవ్ర ఆరోపణలు చేశారు. బన్నీ వాసు విషయం జన సేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నా.. తనకు అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన పార్టీలో మహిళా విభాగం లో సభ్యురాలిగా ఉన్నానని తెలిపారు. తనకు 2019 సంవత్సరంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనలో యాక్టివ్ గా ఉంటున్న మూవీ ప్రొడ్యూసర్ బన్నీ వాసుతో పరిచయం ఏర్పడిందని కొద్ది రోజుల క్రితం తెలిపారు.
తాను జనసేన పార్టీకి పని చేసినందువల్లే టార్గెట్ చేసి సోషల్ మీడియా లో వేధిస్తున్నారని ఆరోపిస్తోంది బోయ సునీత. బోయ సునీత అనే యువతి.గతేడాది జులై నెలలో కూడా ఇదే తరహాలో గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు చేపట్టింది. బన్నీ వాసు తనను వాడుకున్నారని న్యాయం చేయమని అడిగితే బెదిరిస్తున్నాడని ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద సునీత బోయ అనే మహిళ ఆరోపించింది. మలక్‌పేటకు చెందిన సునీత కొన్ని సినిమాల్లో చిన్న, చితక క్యారెక్టర్లు చేసింది.

Woman Complaints on Bunny Vasu
Bunny vasu : నిర్మాతపై ఆరోపణ…
ఈ అమ్మడు తాజాగా మరో సారి గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది.ఫేస్‌బుక్‌లో తనతో చాటింగ్ చేసిన బన్నీవాసు..ఆ పరిచయంతోనే తనను శారీరకంగా వాడుకున్నాడని..అవకాశాల పేరుతో తనను మోసం చేశాడంటూ నిరసన చేపట్టింది. తనకు జరిగిన అన్యాయంపై నిర్మాత అల్లు అరవింద్ , అల్లు అర్జున్ స్పందించాలని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది బోయ సునీత. నడిరోడ్డుపై అర్ధనగ్నంగా ఆందోళనకు దిగడంతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పోలీసులకు విషయం తెలిసి స్వయంగా వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని జూబ్లిహిల్స్ కి తరలించారు