Young Tiger NTR : ” నా తండ్రి మీద ఒట్టు .. మీకు మాట ఇస్తున్నా ‘ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలకి వలవలా ఏడ్చేసిన అభిమానులు..!!

Advertisement

Young Tiger NTR : టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరును ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన ‘ ధమ్ కి ‘ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ విశ్వక్సేను ఓ రేంజ్ లో పొగిడారు.

Young Tiger NTR promise to his fans
Young Tiger NTR promise to his fans

నేను టెన్షన్ లో ఉన్నప్పుడు పదేపదే కొన్ని సినిమాలను చూస్తాను అందులో ఒకటే ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా చాలాసార్లు చూశాను. ఈ సినిమాలో విశ్వక్సేన్ నటన చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ చూశాను. చాలా బాగా నటించాడు. వరుస హిట్లను అందుకోవడం చాలా గొప్ప విషయం. విశ్వక్సేన్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు. నేను ఎందుకు ఇలాంటి సినిమాలు చూస్తున్నాను. కొత్త కొత్త సినిమాలకు కొత్త కాన్సెప్ట్ లకు అవకాశం ఇవ్వాలి అని అభిమానుల కోసం అలాంటి సినిమాలు చేయాలని నాకు నేనే వాగ్దానం చేసుకున్నాను.

Advertisement

Young Tiger Jr NTR Speech @ Das Ka Dhamki Pre Release Event | Vishwak Sen |  Filmyfocus.com - YouTube

అలా వాగ్దానం చేసుకున్న రోజు మళ్ళీ పుట్టాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ గా మాట్లాడారు. అలాగే ఆస్కార్ అవార్డు అందుకోవడం గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడారు. ఆస్కార్ అవార్డు అనేది కేవలం తెలుగు వారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, ప్రతి భారతీయుడు అందుకున్న అరుదైన పురస్కారమని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Advertisement