Mega Hero : మూడు సినిమాలకే మెగా మామల వాడకం ఇష్టం లేదన్న నువ్వు తోపు భయ్యా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mega Hero : మూడు సినిమాలకే మెగా మామల వాడకం ఇష్టం లేదన్న నువ్వు తోపు భయ్యా

 Authored By aruna | The Telugu News | Updated on :4 September 2022,11:00 am

Mega Hero : మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ తేజ్ తాజాగా తన మూడవ సినిమా రంగ రంగా వైభవంగా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. మొదటి సినిమాలో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవిలను చూపించిన వైష్ణవ తేజ్ రెండో సినిమాలో పెద్దగా మామయ్యల జోలికి వెళ్ళ లేదు. కానీ మూడో సినిమా రంగ రంగ వైభవంగాలో సాధ్యమైనంత వరకు పెద్ద మామయ్య మరియు చిన్న మామయ్య లను తెగ వాడేసాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా సన్నివేశాలని కాపీ చేయడంతో పాటు చిరంజీవి పాటని కూడా సినిమాలో వాడేశారు.

మొత్తానికి రంగా రంగా వైభవంగా సినిమాలో సాధ్యమైనంత వరకు మామయ్యలను వాడేసిన మెగా హీరో వైష్ణవ తేజ్ ఇక నుండి మామయ్యలను.. వారి యొక్క ఫోటోలను కానీ డైలాగ్స్ కానీ వాడను అంటూ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ముందు ముందు తాను చేయబోతున్న సినిమాలో కొండపొలం మాదిరిగా ఎలాంటి మామయ్యలా యొక్క సన్నివేశాలను చూపించబోను అంటూ అధికారికంగా ప్రకటించాడు. అంతే కాకుండా తాను వర్క్ చేయబోతున్న దర్శకులతో కూడా అదే విషయాన్ని చెప్పుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.

mega fans and the audience Appreciation for mega hero Panja Vaishnav Tej

mega fans and the audience Appreciation for mega hero Panja Vaishnav Tej

ప్రస్తుతం వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు ఆయన తదుపరి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మూడు సినిమాలు చేయగానే తన మామయ్యలా లను వాడడం మానేస్తాను అంటూ ప్రకటించడంతో వైష్ణవ తేజ్ ని నిజంగా నువ్వు తోపు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లో కొందరు హీరోలు పదుల సంవత్సరాలుగా తమ ఫ్యామిలీ పెద్దలను తమ సినిమాల్లో చూపించుకుంటూ నెట్టుకొస్తున్నారు. కానీ నువ్వు మాత్రం కేవలం మూడు సినిమాలు పూర్తి అయిన వెంటనే మామయ్య సాయం లేకుండానే ముందుకు సాగుతానంటూ ధైర్యంగా ముందడుగు వేయబోతున్నావు. కచ్చితంగా నీకు ఇండస్ట్రీలో మంచి జరుగుతుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది