Amla Candy Recipe : నోట్లోనే కరిగిపోయేలా రుచిగా మరేంతో ఆరోగ్యకరమైన స్వీట్.. ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amla Candy Recipe : నోట్లోనే కరిగిపోయేలా రుచిగా మరేంతో ఆరోగ్యకరమైన స్వీట్.. ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :17 December 2022,7:40 am

Amla Candy Recipe : నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే ఈజీ స్వీట్ రెసిపీ. హెల్తీగా ఉసిరికాయ క్యాండిల్స్ చేసుకోబోతున్నాము. ఈ ఉసిరికాయ స్వీట్ ఆడవారు, పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. ఈవెన్ డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. మరి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ ఆమ్లా క్యాండిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : ఉసిరికాయ, అల్లం, బెల్లం, ఇలాచీ పొడి, నెయ్యి, షుగర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, నల్ల ఉప్పు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా పది పదిహేను ఉసిరికాయలను తీసుకొని వాటిని ఆవిరిపై ఘాట్లు పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.

అలా ఉడికించుకున్న ఉసిరికాయలను తీసుకొని వాటిలోపల గింజలను తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసి, దీనిలో కొంచెం అల్లం ముక్క కూడా వేసి మెత్తని పేస్టులా పట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో ఈ ఉసిరి పేస్ట్ వేసి తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకొని దాన్లో వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత దాన్లో యాలకుల పొడి నల్ల ఉప్పు కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. తరువాత కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలో వేసి దానిలో కొన్ని వాటర్ ని వేసి బాగా కలిపి ఈ ఉడుకుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలా పది పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకుని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఆ మిశ్రమం షైనీగా స్మూత్ గా తయారవుతుంది.

Amla Candy Recipe in Telugu

Amla Candy Recipe in Telugu

పాన్ నుంచి సపరేట్ అయ్యేవరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత గట్టిగా అయ్యేవరకు ఉడికించుకొని ఈ మిశ్రమం చేతిలోకి తీసుకొని రౌండ్ గా చేస్తే చపాతి పిండిలా ఉండాలి అలా వచ్చిన తర్వాత దానిని తీసి బట్టర్ పేపర్ పై వేసి మళ్లీ పైన బట్టర్ పేపర్ వేసి చపాతి కర్రతోని దాన్ని అంత రోల్ చేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని పీసులా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా ఉసిరికాయ క్యాండీ రెడీ అయిపోయినట్లే.. అయితే ఈ పీసెస్ ని కట్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ లో కోట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. దీనిని ఒక్కసారి తింటే అప్పటికప్పుడు ఉసిరికాయలు తెచ్చుకొని తయారు చేసుకుంటారు. అంత బాగుంటాయి. ఇవి నెలరోజుల వరకు నిల్వ ఉంటాయి..

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది