Prawn 65 Recipe : ఇంట్లో ఇలా ఫ్రాన్స్ 65 చేసి పెట్టండి.. ఇక హోటల్ జోలికి పొమ్మన్న పోరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Prawn 65 Recipe : ఇంట్లో ఇలా ఫ్రాన్స్ 65 చేసి పెట్టండి.. ఇక హోటల్ జోలికి పొమ్మన్న పోరు…!

Prawn 65 Recipe : ఈరోజు ఫ్రాన్స్ 65 హోటల్ స్టైల్ చేయబోతున్నాం.. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఓటల జోలికి పొమ్మన్న పోరు అంత టేస్టీగా ఈ ఫ్రాన్స్ 65 ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు  లుసుకోబోతున్నాం.. దీన్ని మీరు ఫ్రాన్స్ 65 అనొచ్చు.. మీరు ఏ పేరుతో అనుకున్నా సరే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందన్నమాట.. కంపల్సరిగా నాన్ వెజ్ లో ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే.. చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అండ్ […]

 Authored By jyothi | The Telugu News | Updated on :8 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Prawn 65 Recipe : ఇంట్లో ఇలా ఫ్రాన్స్ 65 చేసి పెట్టండి.. ఇక హోటల్ జోలికి పొమ్మన్న పోరు...!

Prawn 65 Recipe : ఈరోజు ఫ్రాన్స్ 65 హోటల్ స్టైల్ చేయబోతున్నాం.. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఓటల జోలికి పొమ్మన్న పోరు అంత టేస్టీగా ఈ ఫ్రాన్స్ 65 ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు  లుసుకోబోతున్నాం.. దీన్ని మీరు ఫ్రాన్స్ 65 అనొచ్చు.. మీరు ఏ పేరుతో అనుకున్నా సరే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందన్నమాట.. కంపల్సరిగా నాన్ వెజ్ లో ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే.. చాలా ఈజీగా చేసుకోవచ్చు.. అండ్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఫ్రాన్స్ 65 ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…  దీనికి కావాల్సిన పదార్థాలు: ఫ్రాన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, నిమ్మరసం మొదలైనవి..  తయారీ విధానం: ముందుగా కేజీ రొయ్యల్ని తీసుకొని వాటిని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి.  ఈ రొయ్యల్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా పొడులన్నీ వేసేద్దామండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ పసుపు, ఒకటిన్నర కారం, ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి.

అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వీటన్నిటిని కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలాలన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టించండి ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రైస్ ప్లోర్ వేసుకోండి. ఇవి వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత వీటిని ఒక గంట పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో ఆయిల్ వేయాలి.డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ని హీట్ చేసి మీడియం హీట్ లో పెట్టుకొని ఈ రొయ్యల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మీరు ఎన్ని రొయ్యలు కావాలంటే అన్ని రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు.

ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా డబల్ ఫ్రై చేసుకోండి. సరిపోతుంది. ఇలా అన్ని రొయ్యల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పెనం పెట్టి దానిలో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని ఆ ఉల్లి తరుగును ఇందులో వేయండి. అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలన్నిటిని కూడా వేసేసి జస్ట్ రెండు నిమిషాల పాటు బాగా చాట్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గరకు అవుతుందండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా వేసి ఒక్కసారి టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోవడమే.. అంతే ఎంతో సింపుల్ గా ఫ్రాన్స్ 65 రెడీ బాగుంటుంది. ప్రాన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది