Avakaya Veg Pulao Recipe : యమా ఘాటైన పులావ్ తినాలనుకుంటే బెస్ట్ ఈ ఆవకాయ పులావ్ చేసుకోండి ఇలా…!
Avakaya Veg Pulao Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ పులావ్… స్పైసి ఆవకాయ పులావ్. వీధివీధికి రెస్టారెంట్స్ పెరిగిపోతున్నాయి. వాళ్లు కొత్త కొత్త రెసిపీలు క్రియేట్ చేయాలని వాళ్లు తహతహలాడిపోతున్నారు. అలాంటి రెస్టారెంట్ వాళ్లు క్రియేట్ చేసింది ఈ ఆవకాయ పులావ్.. ఈ ఆవకాయ పులావ్ ని ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుందాం. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : క్యారెట్లు, పచ్చి బఠాణి, టమాటాలు, మిరియాలు, యాలకులు, జిలకర దాల్చిన చెక్క, ఎండు మిరపకాయలు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, కరివేపాకు ఉల్లిపాయలు, క్యాప్సికం, ఆలు, క్యాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీడిపప్పు, పసుపు, కారం, బాస్మతి రైస్, నీళ్లు కొత్తిమీర, ఆవకాయ చట్నీ, ఆయిల్, మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పై పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో 4 యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చినచెక్క, కొన్ని మిరియాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకొని తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కూడా వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత దానిలో అరకప్పు టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ ముక్కలు అన్ని వేసి స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దానిలో ప్రొజన్ బటాని వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలో వేసి బాగా కలుపుకొని ఒక కప్పు బియ్యానికి కప్పున్నార వాటర్ ని వేసి బాగా కలిపి తర్వాత దీనిలో ఆవకాయ చట్నీ రెండు స్పూన్లు తీసుకొని దాన్లో వాటర్ వేసి కలిపి దీంట్లో వేయాలి. తరువాత కొత్తిమీర కూడా చల్లుకొని ఈ కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఈ రైస్ పలుకు పలుకులుగా గుమగుమలాడుతూ సూపర్ గా ఉంటుంది. ఈ ఆవకాయ పులావుని రైతాతో తీసుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
