Healthy Liquor Tea : పొద్దున్నే ఈ లిక్కర్ టీ ని చిన్న గ్లాసు తాగితే వచ్చే కిక్కే వేరు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Healthy Liquor Tea : పొద్దున్నే ఈ లిక్కర్ టీ ని చిన్న గ్లాసు తాగితే వచ్చే కిక్కే వేరు…!!

Healthy Liquor Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి లిక్కర్ టీ చాలా బాగుంటుంది. ఈ టీ అరకప్పు తాగితే ఇక మత్తు వదిలిపోతుంది. చాలా బాగా రిఫ్రెష్ అవుతారు. ఇది బెంగాలీ స్పెషల్ “టీ”వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ టీ బొట్టు బొట్టుగా గొంతులోకి దిగుతుంటే ఆహాహా అని అనాల్సిందే.. దీని మజా మాటల్లో చెప్పడం కన్నా తాగి చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఇక ఈ లిక్కర్ టీ ని ఏ విధంగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 December 2022,7:40 am

Healthy Liquor Tea : ఈరోజు రెసిపీ వచ్చేసి లిక్కర్ టీ చాలా బాగుంటుంది. ఈ టీ అరకప్పు తాగితే ఇక మత్తు వదిలిపోతుంది. చాలా బాగా రిఫ్రెష్ అవుతారు. ఇది బెంగాలీ స్పెషల్ “టీ”వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ టీ బొట్టు బొట్టుగా గొంతులోకి దిగుతుంటే ఆహాహా అని అనాల్సిందే.. దీని మజా మాటల్లో చెప్పడం కన్నా తాగి చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఇక ఈ లిక్కర్ టీ ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం : ఈ టీ కి కావలసిన పదార్థాలు : అల్లం, మిరియాలు, నీళ్లు, పంచదార, బిర్యానీ ఆకు, టీ పౌడర్, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఈ లిక్కర్ టీ కోసం ఒక ఇంచ్ అల్లం దంచి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక పది మిరియాలను వేసి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఇక టీ కోసం స్టౌ పై ఒక గిన్నెను పెట్టి ఒక రెండు కప్పుల నీళ్లను పోసి వాటిని మరగబెట్టాలి. ఆ మరుగుతున్న నీటిలో ఒక స్పూన్ పంచదార వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. మళ్లీ అలా మరుగుతున్న నీటిలో ఒక బిర్యానీ ఆకు నీ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, మిరియాల పౌడర్ కూడా వేసి గంటతో తిప్పుతూ బాగా ముసల పెట్టుకోవాలి. అలా ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత మీరు వాడే టీ పౌడర్ ఏదైనా సరే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ మాత్రమే వేయాలి. మీరు వాడే టీ పౌడర్ ఏదైనా కావచ్చు.

Best Healthy Liquor Tea

Best Healthy Liquor Tea

అయితే మసాలా టీ పౌడర్ లాంటివి మాత్రం వాడుకోవద్దు. ఆ విధంగా ఒక స్పూన్ టీ పౌడర్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు గరిటెతో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఆ విధంగా ఒక నిమిషం పాటు మరిగించుకున్న టీ ని వెంటనే స్టవ్ ఆపి గ్లాసులోకి గరిటతో ఎత్తి వడకట్టాలి. ఆ విధంగా ఎత్తిపోయడం వలన మంచి చిక్కదనం వస్తుంది. అంతే ఎంతో సింపుల్ గా లిక్కర్ టీ రెడీ. ఇది వేడి వేడి గానే తాగితే ఆ మజానే వేరు ఉంటుంది. ఈ “టీ” ని చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు తాగితే ఎంతో రిఫ్రెష్ అవుతారు. జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది