Bread Kova : ఇంట్లో స్వీట్ చేయమని అడిగితే.. ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే స్వీట్ నిమిషాల్లో చేసి పెట్టండి…!
Bread Kova : ఈరోజు బ్రెడ్ కోవా టోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. పిల్లలకైనా, మీకైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈ బ్రెడ్ టోస్ట్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము..
దీనికి కావలసిన పదార్థాలు: బ్రెడ్, పాలు, పాల పౌడర్, పంచదార, నూనె, నెయ్యి, యాలకుల పొడి మొదలైనవి.. తయారీ విధానం : ముందుగా బ్రెడ్ పీసులు తీస్కొని మిడిల్ లో వైట్ ఉంటుంది కదా.. ఆ వైట్ పార్ట్ వరకు తీసుకోవాలి. బ్రెడ్ ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేయాలి. మొత్తం ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట ఇంకో కడాయి పెట్టుకుని ఇందులో ఒక అరకప్పు దాకా పంచదార, ఒక అర కప్పు నీళ్లు వేసుకొని పంచదార మొత్తం వాటర్ లెవెల్ లోకి కరిగేంతవరకు కరిగించుకోండి. కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలుకల పొడి వేసి బాగా కలిసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా.. ఆ బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని ఈ పాకం అంతా పీల్చుకునేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకోండి.
తర్వాత ఇలా ఒకవైపు కాస్త జ్యూసీగా అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా పంచదార వాటర్ లో ఉంచుకొని ఇవి కాస్త సాఫ్ట్ గా అయిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక బ్రెడ్ ముక్కలు అన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఈ పంచదార వాటర్ ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మరలా ఇదే ప్యాన్ ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని ఈ పాన్ లోకి తీసుకొని పాలు కాస్త ఒక మరుగు వచ్చేంతవరకు మరిగించుకోండి. పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకొని ఈ మిల్క్ పౌడర్ కూడా పాలల్లో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గరపడి చిక్కబడిన తర్వాత ముందుగా మనం పాకాన్ని పంచదార పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా.. ఆ పాకాన్ని మీ స్వీట్ కి తగ్గట్లుగా వేసుకొని ఈ పాకం కూడా పాలల్లో బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదంతా దగ్గరగా అయిపోయి కోవా రెడీ అయిపోతుంది.
అప్పటివరకు ఇలా కలుపుతూనే కంటిన్యూస్గా ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక తరువాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా..బ్రెడ్ ముక్కల్ని తీసుకొని ఒక్కొక్క ముక్క మీద ముందుగా రెడీ చేసుకున్న కోవా ని అప్లై చేసుకోండి. ఇలా ప్రతి ఒక్కముక్కకి కోవాన్ని అప్లై చేసుకుని మరొక ముక్కతో క్లోజ్ చేసుకోండి. రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కోవాని అప్లై చేసుకుని కాస్త గట్టిగా ప్రెస్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే.. నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోయి బ్రెడ్ కోవా టేస్ట్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు మీరు చాలా హెల్దీగా ఈజీగా చేసి పెట్టొచ్చు..