Chicken Fry Recipe : నోరూరించే చికెన్ ఫ్రై ఎన్ని కిలోల చికెన్ అయినా ఈజీగా రుచిగా చేయొచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Fry Recipe : నోరూరించే చికెన్ ఫ్రై ఎన్ని కిలోల చికెన్ అయినా ఈజీగా రుచిగా చేయొచ్చు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :1 January 2023,7:40 am

Chicken Fry Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా చికెన్ ఫ్రై ని చూపించబోతున్నాను. చికెన్ ఫ్రై చాలా ఈజీ మెథడ్ లో రుచిగా నీచు వాసన రాకుండా బాగా కుదిరేలా చేయాలంటే ఈ స్టైల్ లో చేయండి. ఎక్కువ క్వాంటిటీతో చికెన్ ఫ్రై చేయాలంటే ఇలాగే చాలా తేలిగ్గా ఎన్ని కిలోల చికెన్ అయినా కారం ఉప్పు వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ఫ్రై ని టేస్టీగా పర్ఫెక్ట్ గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా కమ్మగా కుదరడమే కాదు.. చేసిన అలసట కూడా అనిపించదు. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర ,సోంపు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొదలైనవి… దీని తయారీ విధానం : ఇక్కడ చికెన్ ఫ్రై చేయడానికి కిలో చికెన్ తీసుకున్నాను..

ఈ చికెన్ ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఒక స్పూను, ఉప్పు అర టీ స్పూన్ పసుపు తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇవి వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ ని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై లోకి మసాలా పొడి కోసం మిక్సీ జార్లో మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ సోంపు అలాగే స్పైసెస్ కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకునే దాన్లో ఆయిల్ వేసి దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి.

Chicken Fry Recipe In Telugu on Video

Chicken Fry Recipe In Telugu on Video

బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. చిన్నగా చేసి తర్వాత దానిలో బిర్యానీ ఆకు ముక్కలు చేసి వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకోవాలి. చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూ రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దింపి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది