Chicken Fry Recipe : ఈసారి చికెన్ వేపుడు (సీక్రెట్ రెసిపీ) ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ గా వస్తుంది…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chicken Fry Recipe : ఈసారి చికెన్ వేపుడు (సీక్రెట్ రెసిపీ) ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ గా వస్తుంది…!

Chicken Fry Recipe : ఈ రోజు చికెన్ ఫ్రై ని చాలా సింపుల్ గా క్విక్ గా ఎలా తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఈ చికెన్ ఫ్రై ని రైస్ లోకి గాని బిర్యానీలోకి గాని రోటీస్ తో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..  కావలసిన పదార్థాలు; చికెన్, కారం ,ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chicken Fry Recipe : ఈసారి చికెన్ వేపుడు (సీక్రెట్ రెసిపీ) ఇలా చేసి చూడండి సూపర్ టేస్ట్ గా వస్తుంది...!

Chicken Fry Recipe : ఈ రోజు చికెన్ ఫ్రై ని చాలా సింపుల్ గా క్విక్ గా ఎలా తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఈ చికెన్ ఫ్రై ని రైస్ లోకి గాని బిర్యానీలోకి గాని రోటీస్ తో కానీ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..  కావలసిన పదార్థాలు; చికెన్, కారం ,ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, నిమ్మరసం, పెరుగు ,మిరియాల పొడి, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆయిల్ ,కస్తూరి మేతి మొదలైనవి.. తయారీ విధానం: ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందు మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్ ఫ్రై కి ఎప్పుడు కూడా బోన్ లెస్ కన్నా బోన్స్ తోనే చికెన్ ఫ్రై టేస్టీగా వస్తుంది. ఈ అరకేజీ చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ లోకి అర కప్పు దాకా పెరుగుని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోండి.

ఇక్కడ నేను హోమ్ మేడ్ గరం మసాలా పొడిని వాడుతున్నానండి. తర్వాత రెండు టీ స్పూన్ల ఫ్రెష్ గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా మొత్తం చికెన్ కి పట్టించండి. ఇలా అంతా కూడా కలుపుకుని ఈ చికెన్ ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం ముదురు చిక్కిన అనుకోండి ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకుంటే కొంచెం టెండర్ గా వస్తుంది. ఇలా గంటపాటు చికెన్ ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. గిన్నెలోని మనం ఆయిల్ ఏమీ వేయలేదండి. డైరెక్ట్ గానే ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని గిన్నెలో వేసేసి ఉడికించుకుంటున్నాము. చికెన్ అంతా వేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ 15 నుండి 20 నిమిషాల పాటు చికెన్ ని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ని కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా బాయిల్ చేసుకోండి. చికెన్ లో ఉండే వాటర్ అంతా ఇనికి దగ్గరగా అయ్యేంతవరకు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద చికెన్ ని ఫ్రై చేసుకోవడం కోసం వేరొక పాన్ ని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.

చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో చికెన్ కి తగ్గట్టు మనం ఆయిల్ ని పాన్ లో వేసుకోవాలి. ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ షాజీరా ని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగు యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ ముందు బాయిల్ చేసి తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉల్లిపాయ ముద్ద అలాగే మసాలా అడుగంటి పోకుండా వేస్ట్ కాకుండా ఈ ఫ్రైకి గ్రేవీలర్స్ అనేది వచ్చి రైస్ లోకి గాని బిర్యానీలోకి గాని కలుపుకోవడానికి బావుంటుంది. ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్ ని మీరు పాటించి చూడండి. చికెన్ ఫ్రై చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తుంది. చికెన్ ని పాన్ లో ఆడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ అటు ఇటు తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నుండి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ బాగా డ్రైగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలి. లేదా గ్రేవీ గ్రేవీ గా ఉండాలి అనుకుంటే కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చికెన్ ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే పుదీనా అని కూడా వేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది