Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఊరు ఊరంతా నచ్చేలా ఇలా ఒకసారి చేసి చూడండి.. లొట్టలేయాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఊరు ఊరంతా నచ్చేలా ఇలా ఒకసారి చేసి చూడండి.. లొట్టలేయాల్సిందే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :30 November 2022,7:40 am

ఈరోజు రెసిపీ వచ్చేసి కేజీ చికెన్ తో టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్లే కాదు. పక్కింటి వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రై కి ఫాన్స్ అయిపోతారు.. అంత బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : చికెన్, నిమ్మరసం, పసుపు, కారం, ఉప్పు,ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొదలైనవి…

దీని తయారీ విధానం : ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం, కొంచెం పసుపు, ఒక రెండు స్పూన్ల కారం, ఒక రెండు స్పూన్ల ఆయిల్, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి ఆ నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి బాగా కుక్ అవనివ్వాలి. చికెన్ కుక్ అవుతుండగా.. దాంట్లోకి మసాలా కోసం మిక్సీ జార్లో రెండు స్పూన్ల ధనియాలు, నాలుగు యాలకులు,

Chicken Fry Recipe in Telugu

Chicken Fry Recipe in Telugu

నాలుగు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఎండు కొబ్బరి, ఆరు ఎండు మిరపకాయలు వేసి మెత్తగా పౌడర్ల పట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా చికెన్ ఫ్రై మిశ్రమాన్ని మళ్లీ చూసి దానిలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఎర్రగా అయ్యేవరకు వేయించుకుని తర్వాత దానిలో నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కొంచెం కరివేపాకు నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయ్యేవరకు వేయించుకొని తర్వాత దింపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. ఇది మీ ఇంట్లో వాళ్లే కాదు.. మీ పక్కింటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది