Chicken liver Fry Recipe : చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెట్టే చికెన్ లివర్ వేపుడు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken liver Fry Recipe : చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెట్టే చికెన్ లివర్ వేపుడు ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే…!

Chicken liver Fry Recipe : ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చికెన్ లివర్ వేపుడు మంచి రుచిగా చేసి చూపిస్తాను చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మాకు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండేది ఉట్టిదే తినేవాళ్ళం చాలా బాగుంటుంది టేస్టు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ గా చేసి చూపిస్తాను ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఎలా తయారు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 October 2022,4:00 pm

Chicken liver Fry Recipe : ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చికెన్ లివర్ వేపుడు మంచి రుచిగా చేసి చూపిస్తాను చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మాకు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండేది ఉట్టిదే తినేవాళ్ళం చాలా బాగుంటుంది టేస్టు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ గా చేసి చూపిస్తాను ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు : లివర్స్, ఉప్పు, కారం ,పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు ,దాల్చిన చెక్క ,లవంగాలు, యాలకులు మొదలైనవి… లివర్లని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి అంటే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా అలా అని మరీ చిన్నగాను కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇలా ఒక బౌల్ లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకోవడానికి పాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ చెక్క, ఏడు లేదా ఎనిమిది లవంగాలు వేసి ఫ్లేమ్ నీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఏవీ మాడకుండా దోరగా వేయించుకోండి.

ఇవి వేయించుకునేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించండి. ఇప్పుడు ఏవి మాడకుండా ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లము, ఇలా ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని తీసుకొని వీటిని అన్నింటినీ కలిపి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేయండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి. కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకోండి. ఇలా కాస్త కలర్ మారేంతవరకు వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకుని వేసుకొని వేయించుకోండి. కరివేపాకు తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ కరివేపాకు కూడా లైట్ గా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న కూడా వేసుకోండి. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి.

Chicken liver Fry Recipe in TelugU

Chicken liver Fry Recipe in TelugU

కలిపేసిన తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి 10 లేదా 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించండి. ఎందుకంటే మీకు ఈ చికెన్ లివర్ లో నుంచే వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చి పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అలా వచ్చే అంతవరకు ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెడుతూ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంతవరకు మూత పెట్టి మగ్గించాలి. మీరు ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మూత చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతాయి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్లేమ్ ని సిమ్లో పెట్టేసి మరొక పది నిమిషాలు బాగా వేయించండి.10 లేదా 15 నిమిషాలు అన్న టైం పడుతుంది. మీకు వేగడానికి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వండి అప్పుడే మీకు బాగా వేగి టేస్ట్ బాగుంటాయి. ఇలా వేయించుకునేటప్పుడే మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఒక ముక్కని నోట్లో వేసుకొని టేస్ట్ చేసి మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోండి. మరి ఎక్కువ ఉంచారుఅనుకోండి మీకు ముక్క అనేది గట్టిగా అయిపోతుంది.

తినడానికి గట్టిగా అనిపిస్తుంది అందుకని ఇలా వచ్చిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు. దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకొని ఫ్లేమ్ నే సిమ్ లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించండి. అంతకంటే ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ మసాలా కారము మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు వేయిస్తే సరిపోతుంది. ఇంక మీరు ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు ఈ మసాలా పొడి తోటి భలే టేస్టీగా ఉంటుంది. ఈ లివర్ వేపుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు చికెన్ లివర్ తోటి వేపుడు ఇదే విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకుని ప్లేట్లో పెట్టుకొని తినండి అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు…

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది