Coconut Sweet Recipe : పచ్చి కొబ్బరి తో కమ్మని స్వీట్.. టేస్ట్ చూస్తే ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే…!
Coconut Sweet Recipe : రోజు మనం చేసుకునే రెసిపీ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే స్వీట్ ని చూపించబోతున్నాను.. చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇంట్లో పచ్చికొబ్బరి ఉన్న ప్రతిసారి ఈ స్వీట్ చేయమని అడుగుతారు. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : కొబ్బరి, నెయ్యి, బొంబాయి రవ్వ, గోధుమపిండి, యాలకుల పొడి, పంచదార, ఆయిల్, కుంకుమపువ్వు, దీని తయారీ విధానం : ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్ లో వేసి మళ్లీ ఒకసారి వేసుకుని ఆ కొబ్బరిని తీసి ఒక స్త్రైనర్లో ఒక క్లాత్లో లో ఈ కొబ్బరి అంతా వేసి పిండి కొబ్బరి పాలను తీసి పక్కన ఉంచుకోవాలి.
తర్వాత ఒక పాన్ ని పెట్టుకుని దానిలో నెయ్యి వేసి పావు కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు ,గోధుమపిండి వేసి బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దాన్లో ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు కొంచెం కొంచెం వేస్తూ చపాతీ పిండి మాదిరిగా వచ్చేవరకు కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక స్టౌ పై పాన్ పెట్టి దానిలో రెండు కప్పుల చక్కెరను వేసి కొంచెం నీళ్ళని వేసి దానిలో కొంచెం కుంకుమపువ్వు ని వేసి చక్కెర కరిగి ఒక 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. అలా మరిగిన చక్రపాకాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకొన్న గోధుమపిండి మిశ్రమాన్ని బాగా కలుపుకొని దాన్ని చిన్న బాల్స్ చేసుకొని వాటిని రౌండ్ గా చేసుకొని బాదుషా లా ఒత్తుకొని
దానికి మీ ఇష్టం వచ్చిన డిజైన్ను పెట్టుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ జామున్లని ఆయిల్ లో వేసి వెంటనే టర్న్ చేయకుండా రెండు నిమిషాలు పాటు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకంలో వేసి అరగంట పాటు వాటిని ఉంచితే జామున్లు పాకం బాగా పీల్చుకుంటాయి. ఒక అరగంట తర్వాత అవన్నీ బాగా పాకాన్ని పీల్చుకుంటాయి. అలా జామున్ లోకి పాకమంతా పోయి బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. అంతే పచ్చి కొబ్బరి తో కమ్మని స్వీటు రెడీ. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటాయి.