Dondaakaya Fry Recipe : దొండకాయ ఫ్రై రుచిగా కుదరాలంటే ఈ విధంగా ట్రై చేయండి..!
Dondaakaya Fry Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని దొండకాయ ఫ్రై ని ఎలా చేయాలో ఈజీ మెథడ్ లో మీతో షేర్ చేసుకోబోతున్నాము.. ఎప్పుడు చేసిన టేస్ట్ ఫర్ఫెక్ట్ గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసిన సింపుల్ మెథడ్ లో పర్ఫెక్ట్ గా కుదిరే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : దొండకాయలు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పసుపు, మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, కారం, ఉప్పు, మసాలా, కొత్తిమీర, కొబ్బరిపొడి, మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా అరకిలో దొండకాయల్ని తీసుకొని వాటిని రౌండ్ గా చక్రాల కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఈ దొండకాయ ఫ్రై చేయడానికి ఒక కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. తర్వాత అయిల్ లో ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించాక కొంచెం పసుపు వేసి కలుపుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకుంటే అడగనేది పెట్టేసి మాడిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా కలపండి. ఒకసారి ఇలా బాగా కలిపాక కవర్ చేసి మంటను మీడియం
ఫ్లేమ్ లో పెట్టి ఐదారు నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు అనేవి కింద మాడిపోకుండా ఈవెన్గా ఉడికించాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మంటను ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు ఈ దొండకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కారం వేసి చివర్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.చాలా బాగుంటుంది. కూడా ఓసారి ఈ విధంగా దొండకాయ ఫ్రై ని తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ గా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది.