Kaju Pakodi : కాజు పకోడీ.. మీరు ఈ టిప్స్ తో చేస్తే స్వీట్ షాప్ లో టెస్ట్ గ్యారెంటీ…!
Kaju Pakodi : జీడి పప్పు పకోడీ స్వీట్ షాప్ లో పకోడీలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.. ముందుగా జీడిపప్పు పకోడీకి ఒక బౌల్లో ఒక కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోండి. బద్ద జీడిపప్పు కన్నా హోల్ జీడిపప్పుతో పకోడి బాగుంటుంది. తర్వాత పావు కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల వరి పిండిని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకుని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులో జస్ట్ టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం రెగ్యులర్ గా పకోడీ చేసుకునే విధంగా కాకుండా ఈ జీడిపప్పు పకోడీకి గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే పకోడీ చక్కగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దికొద్దిగా ఈ విధంగా పకోడీ మాదిరిగా వేసుకోండి. ఈ విధంగా ప్యాన్ కి నిండుగా ఈ పకోడీని యాడ్ చేసుకుని గరిటతో తిప్పుకుంటూ ఈవెన్గా అన్ని వైపులా వేగేటట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి.
ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే విధంగా పకోడీ అంతటినీ కూడా వేసుకుని వేయించుకోండి. ఈ జీడిపప్పు పకోడీకి జస్ట్ జీడిపప్పు బైండింగ్ కోసం మాత్రమే ని యూస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకుని ఆ కరివేపాకు ని కూడా ఈ విధంగా గార్నిషింగ్ కోసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ జీడిపప్పు పకోడిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.. దీని టేస్ట్ సేమ్ స్వీట్ షాప్ లో కాజు పకోడీలా ఉంటుంది.