Moringa Leaves Laddu : మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే… మునగాకు లడ్డు రోజుకి ఒకటి తినండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Moringa Leaves Laddu : మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే… మునగాకు లడ్డు రోజుకి ఒకటి తినండి..!

Moringa Leaves Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఆకుకూరలలో చాలా తక్కువ మంది వాడేది మునగాకు. మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా వీటిని తినేవారు సంఖ్య తక్కువే.. మునగాకు తినడానికి చాలామంది ఇష్టపడరు.. అలాంటివారు మునగాకుతో లడ్డు చేసుకుని తీసుకోవచ్చు.. మునగాకుని ఆహారంలో భాగం చేసుకోమని నిపుణులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు.. మునగాకులతో అనేక రకాల వంటకాలను వండుకోవచ్చు.. మునగాకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Munaga Leaves Laddu : మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే... మునగాకు లడ్డు రోజుకి ఒకటి తినండి..!

Moringa Leaves Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఆకుకూరలలో చాలా తక్కువ మంది వాడేది మునగాకు. మునగాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినా వీటిని తినేవారు సంఖ్య తక్కువే.. మునగాకు తినడానికి చాలామంది ఇష్టపడరు.. అలాంటివారు మునగాకుతో లడ్డు చేసుకుని తీసుకోవచ్చు.. మునగాకుని ఆహారంలో భాగం చేసుకోమని నిపుణులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు.. మునగాకులతో అనేక రకాల వంటకాలను వండుకోవచ్చు.. మునగాకు పొడితో చేసిన లడ్డూలను రోజుకొకటి తింటే చాలు.. అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి.

మునగాకుల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే.. మునగాకులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ ,మధుమేహం లాంటివి రాకుండా ఉంటాయి. అలాగే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.. మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.. మునగాకులోని పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ మునగాకులలో రోజుకు ఒకటి తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి..
ఈ మునగాకు లడ్డూను చేయడం కూడా చాలా సులభం. ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Moringa Leaves Laddu : మునగాకు లడ్డు కి కావలసిన పదార్థాలు

మునగాకు పొడి రెండు కప్పులు, నట్స్ ఒక కప్పు, తేనె నాలుగు స్పూన్లు, సన్ ఫ్లవర్ సీడ్స్ అరకప్పు, యాలకుల పొడి అర స్పూను, నెయ్యి సరిపడాంత,ఖర్జూరం ఏడు, కొబ్బరి తురుము ఒక కప్పు…

Moringa Leaves Laddu మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే మునగాకు లడ్డు రోజుకి ఒకటి తినండి

Moringa Leaves Laddu : మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే… మునగాకు లడ్డు రోజుకి ఒకటి తినండి..!

Moringa Leaves Laddu : తయారీ విధానం

ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టి దానిలో తురిమిన కొబ్బరిని వేసి కాస్త బంగారం రంగులోకి వచ్చేవరకు దాన్ని బాగా వేయించుకోవాలి. తర్వాత తీసి దాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొద్దుతిరుగుడు గింజల్ని వేసి వేయించి వాటిని కూడా తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్ష, బాదం, పిస్తా వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న అన్ని ఇంగ్రిడియంట్స్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాన్లో మునగాకుల పొడిని వేయాలి. అలాగే వేయించిన కొబ్బరి తురుము, నట్స్ ఖర్జూరం కలిపిన పేస్టు తేనె వేయించుకున్న పద్ధతిలో గింజలు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కాస్త నెయ్యిని వేసి చేతులు కూడా నెయ్యిని రాసుకొని ఆ మిశ్రమాన్ని లడ్డూల చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఈ లడ్డూలని గాజు కంటైనర్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు..

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది