Munakkaya Curry Recipe : ఉల్లిపాయ మునక్కాయ ఉంటే చాలు.. అన్నంలోకి అదిరిపోయే కూర రెడీ..!
Munakkaya Curry Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ మునక్కాయ కూర.. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎక్కువగా ఇంగ్రిడియంట్స్ అవసరం లేదు. అలాగే పులుసు కూరలు ఇష్టపడని వాళ్ళు ఇలా మునక్కాయ ఉల్లిపాయతో కర్రీ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ఉల్లిపాయ మునక్కాయ కూర సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు,ఆయిల్ మొదలైనవి… దీన్ తయారీ విధానం : ముందుగా మునక్కాడలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ మునక్కాడలు లేతవైతే ఈ కూరకి చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలను ఒక రెండు కప్పుల వరకు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత కప్పున్నర ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అలాగే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి బాగా కలుపుకొని ఇది ఏగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా దానిలో వేసి బాగా కలుపుకోవాలి. పది నిమిషాలు తర్వాత మూత తీసి దానిలో ఒక రెండు స్పూన్ల కారం,
స్పూనున్నర ఉప్పు వేసి బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర లోంచి ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కొత్తిమీర సన్నగా తురుముకొని దీనిలో చల్లుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఇక తర్వాత ఈ కూరను తీసి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్ గా ఉల్లిపాయ మునక్కాడ కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రిడియంట్స్ అవసరం లేదు.. ఈ మునక్కాడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ ఈ విధంగా ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా దీనిని ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు..