Mutton Paya Recipe : సింపుల్ గా మటన్ పాయను ఈజీగా ఇంట్లోనే ఇలా చేయండి .. టేస్ట్ అదిరిపోద్ది ..!
Mutton Paya Recipe : ప్రస్తుత కాలంలో చాలామంది మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. చికెన్ మటన్ ఫిష్ ఇలా ఎన్నో రకాల మాంసాహారాలను తింటున్నారు. చికెన్ కంటే మటన్ లోని ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని అంటుంటారు. అయితే చాలామందికి మటన్ పాయను ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. మరి కొంతమంది అది చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చేయడం మానేస్తారు. అలాంటి వారికి సింపుల్ గా ఇంట్లోనే మటన్ పాయను ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు : 1)మేక కాళ్లు 2) ఆయిల్ 3) ఉప్పు 4) పసుపు 5) కారం 6) అల్లం వెల్లుల్లి పేస్ట్ 7) జీలకర్ర 8) ధనియాల పొడి
9) మటన్ మసాలా 10) ఆవాలు 11) కొత్తిమీర 12) పచ్చిమిర్చి 13) ఉల్లిపాయ 14) ఎండుమిర్చి 15) కరివేపాకు 16) టొమాటోతయారీ విధానం : ముందుగా ఎనిమిది మటన్ పాయలను తీసుకుని మూడుసార్లు శుభ్రంగా కడిగి అందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ ఒంపేసి రెండు టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు, వన్ టీ స్పూన్ జీలకర్ర, రెండు మూడు పచ్చిమిర్చిలు, రెండు మూడు ఎండుమిర్చిలు, తరిగిన మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గాక కొంచెం కరివేపాకు వేసి కొంచెం కలర్ మారాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
ఫ్రై చేసుకుని రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు వేసి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత పాయలను వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మటన్ మసాలా , వన్ టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి హై ఫ్లేమ్ లో చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. చివర్లో కొంచెం కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ పాయ రెడీ.
https://youtube.com/watch?v=CuoT3stbr1A&si=EnSIkaIECMiOmarE