Murukulu Recipe : నోట్లు వేసుకుంటే వెన్నెల కరిగిపోయే కమ్మని పెసర మురుకులు…!
Murukulu Recipe : నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే పెసర మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు, బియ్యప్పిండి, నల్ల జిలకర, కారం, ఉప్పు, బటర్, ఇంగువ పొడి, ఆయిల్, వాటర్ మొదలైనవి… దీని తయారీ విధానం : పెసర మురుకులు కోసం ముందుగా కుక్కర్లో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దానిని తీసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి రెండు కప్పుల బియ్యప్పిండిని వేయాలి. దాంట్లో ఒక రెండు స్పూన్ల నల్ల జీలకర్ర, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ పొడి, రెండు స్పూన్ల బటర్ వేసి బాగా చేత్తో రఫ్ చేయాలి. తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా చపాతీ పిండిలా కలుపుకొని ఒకవేళ నీళ్లు పడితే యడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పై డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మురుకులు గొట్టంలో వేసి దాన్ని మురుకుల్లాక ఒక ప్లేట్ పై వేసుకొని ఆ మురుకుల్ని ఆయిల్లో వేసి రెండు వైపులా బాగా కాల్చి తీసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే పెసరపప్పు మురుకులు రెడీ. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు ఇనిస్టెంట్ గా ఈ మురుకులను చేసుకోవచ్చు.. చాలా రుచిగా ఉంటాయి…