Ragi Sweet Recipe : పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ మెచ్చే రుచికరమైన స్వీట్ ఇదే…!
Ragi Sweet Recipe : స్వీట్స్ ను అందరూ ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ స్వీట్స్ తినడానికి ఆసక్తి చెపుతారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి స్వీట్ ని తిందామంటే ఎంతో రుచిగా ఉంటుంది. రాగులు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసింది. అలాంటి రాగులతో స్వీట్ ని చేసుకుని తిన్నామంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1)రాగి పిండి 2) వాటర్ 3) నెయ్యి 4) పుట్నాల పప్పు 5) బెల్లం 6) యాలకుల పొడి
తయారీ విధానం: ఈ రాగి స్వీట్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఒకటిన్నర కప్పు రాగి పిండిని తీసుకోవాలి. తర్వాత కొన్ని పుట్నాలపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగాక రాగి పిండిని వేసి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత పిండి నీళ్లలో కలిసేంతవరకు బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులో మన ముందుగా వేయించుకున్న పుట్నాలపప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Ragi Sweet Recipe in Telugu
తర్వాత ముందుగా తురుముకున్న బెల్లం వేసి, ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగాక ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో అరకప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి స్వీట్ రెడీ అయిపోయినట్లే.
