Sorakaya Bajji Recipe : 5 నిమిషాలలో క్రిస్పీగా సొరకాయ బజ్జి… పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు…!
Sorakaya Bajji Recipe : రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ బజ్జి. చాలా టేస్టీగా బంగాళదుంప లేకుండానే ఇలా బజ్జి చేసుకోండి. బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది. చాలామంది హెల్త్ ఇష్యూస్ కారణంగా ఆలూని తినలేరు కాబట్టి ఇలా సొరకాయతో ఈ విధంగా బజ్జీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బజ్జీకి బజ్జి తీసుకోవచ్చు. దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం… సొరకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు : శనగపిండి, బియ్యపిండి, కొత్తిమీర, ధనియా పౌడర్, కరివేపాకు, కొంచెం వాము, కొంచెం సోడా, ఉప్పు, ఆయిల్, కొంచెం కారం, ఉప్పు ,సొరకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొదలైనవి..
దీని తయారీ విధానం : ముందుగా లేత సొరకాయని ఒకటి తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసి ఆలుగడ్డ స్లైసెస్ లాగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకుని వాటిని ఉప్పునీటిలో వేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఇవి కలర్ మారకుండా ఉంటాయి. ఎంతసేపు ఉన్న కానీ. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శెనగపిండి 1/4 కప్పు బియ్యప్పిండి వేసుకొని దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూను ధనియా పౌడర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు తర్వాత ఒక స్పూను వాము నలిపి వేసుకోవాలి.
తర్వాత ఈ విధంగా వేసి బాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకొని ఒక స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉప్పు నీటిలో వేసిన సొరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో ముంచి ఆలుగడ్డ బజ్జీల మాదిరిగా వేసి రెండు వైపులా ఎర్రగా క్రిస్పీగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఆళ్లగడ్డ బజ్జీల మాదిరిగా సొరకాయ బజ్జీలు రెడీ. ఎంతో సింపుల్ రెసిపీ పిల్లలు కూడా చేసేస్తారు. అలాగే ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఆలుగడ్డలు తినలేని వారు ఇలా సొరకాయతో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బజ్జీలకి బజ్జీలు తినొచ్చు…