Usirikaya Rasam Recipe : చలికాలంలో వచ్చే రోగాలన్నిటిని పోగొట్టే ఉసిరికాయ రసం…!
Usirikaya Rasam Recipe : ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ రసం. ఈ రసం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇది చలికాలంలో చేసుకుని తిన్నారంటే ఈ సీజన్లో వచ్చే రోగాలు అన్నిటిని సింపుల్గా పోగొడుతుంది. చలికాలం అందరూ తీసుకోదగ్గ రసం. దీనిని తీసుకుంటే డైజేషన్ సిస్టం కూడా మెరుగుపడుతుంది.ఈ రసం ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : ఉసిరికాయలు, మిరియాలు టమాటాలు, జీలకర్ర, ఆయిల్ ఆవాలు, ఇంగువ, కరివేపాకు ఎండుమిర్చి, పచ్చిమిర్చి అల్లం తరుగు, ఉప్పో పసుపు, పప్పు, వాటర్, కొత్తిమీర, మొదలైనవి…
దీవి తయారీ విధానం : ముందుగా ఉసిరికాయలని తీసుకొని వాటిని గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు టమాట ముక్కలు పండువే కావాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి మెత్తని పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక్కడై పెట్టుకొని దానిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా ఒక స్పూన్ ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం తరుగు కొంచెం కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి చీలికలను వేసి బాగా వేయించుకోవాలి.
ఆ విధంగా వేగిన తర్వాత దానిలోకి కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని దీనిలో వేసి బాగా కలుపుకొని తరువాత దానిలో ఒక లీటర్ వరకు నీటిని వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పొంగు వచ్చేవరకు మరగబెట్టాలి. ఇక దీనిలోకి చింతపండు అవసరం లేదు. ఉసిరికాయ పులుపు ఒగరు తో సరిపోతుంది. ఇక చివరిగా మనం ముందు ఉడకపెట్టుకున్న పప్పుని ఒక కప్పు వేసి బాగా కలిపి తర్వాత కొత్తిమీర కూడా వేసి దింపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఆరోగ్యం. చలికాలంలో వచ్చే రోగాలన్నిటిని పోగొట్టే ఉసిరికాయ రసం రెడీ. ఇది జలుబు, దగ్గు కఫాన్ని తొందరగా తగ్గిస్తుంది.